Sri Singireddy Niranjan Reddy, Hon’ble Minister for Agriculture – Farm to Home service By walk for Water Organisation.

*88753 51555 నంబర్కి ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే ఇంటివద్దకే పండ్లు .. వాక్ ఫర్ వాటర్ సంస్థ ప్రయత్నాన్ని అభినందించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు*

మిస్డ్ కాల్ ఇస్తే మీ ఇంటికే పండ్లు

– వాక్ ఫర్ వాటర్ సంస్థతో తెలంగాణ ప్రభుత్వ ఫామ్ టు హోం సేవలు
– ఇప్పటికే 30 వేల కుటుంబాలకు తాజా పండ్లు సరఫరా
– ప్రజల నుండి విశేష ఆదరణ
– 88753 51555 నంబర్కి ఒక్క మిస్డ్ కాల్ ఇవ్వండి
– రూ.300 కు ప్రజల ఇంటి వద్దకే మామిడి(1.5 కేజీ), బొప్పాయి (3 కేజీలు), నిమ్మ(12కాయలు), పుచ్చ(3 కేజీలు), బత్తాయి(2 కేజీలు), సపోట(1 కేజీ) పండ్ల డెలివరీ
– పై నంబర్కి మిస్డ్ కాల్ ఇవ్వగానే… SMS రూపం లో ఆర్డర్ నమోదు పత్రం… అందులో కావాల్సిన పండ్ల పరిమాణం, చిరునామా నింపితే… 78 గంటల్లోగా ఇంటి వద్దకే పంపిణీ
– రైతులుగా రైతుల కష్టాలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి , నాకూ తెలుసు
– కరోనా మూలంగా లాక్ డౌన్ తో చేతికి వచ్చిన రైతుల పండ్లు తోటల్లోనే మగ్గిపోతున్న పరిస్థితులు వస్తాయంటేనే బాధగా ఉంది
– ప్రజలు ఖరీదు చేసే ప్రతి పండూ రైతులకు అండగా నిలవటంలో భాగమే
– విపత్కర పరిస్థితులలో రైతులకు – వినియోగదారులకు వారధిగా నిలుస్తున్న వాక్ ఫర్ వాటర్ వ్యవస్థాపకులు కరుణాకర్ రెడ్డిని అభినందించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు
– దాతలు ముందుకు వచ్చి ఆన్ లైన్ లో ఆర్డర్ ఇస్తే వారి తరపున ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులు, అనాధాశ్రమాలు, వృద్దాశ్రమాలలో సంస్థ తరపున పండ్లు అందజేత
– పెద్దమనసు చేసుకోండి .. దాతలు ముందుకు రండి .. మన రైతులకు అండగా నిలవండని పిలుపునిచ్చిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు.

Share This Post