Press Release
Please Cover
For Print & Electronic Media
తేది.15/06/2021, హైదరాబాద్
*‘వరి నేరుగా విత్తుకునే పద్దతులపై’ టీ శాట్ ఛానల్ లో జరిగిన చర్చలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, రైతుబంధు సమితి అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, తెలంగాణ వరి పరిశోధన కేంద్రం ప్రిన్స్ పల్ సైంటిస్ట్ రఘురాం రెడ్డి గారు, శాస్త్రవేత్త హేమంత్ కుమార్ గారు*
వరి సాగులో ఆధునిక పద్దతులు పాటించాలి
– వెద జల్లడం, విత్తుకోవడం మూలంగా పెట్టుబడితో పాటు సమయం ఆదా అవడంతో పాటు దిగుబడి, రాబడి పెరుగుతుంది
– దక్షిణ భారతదేశం, తూర్పు భారతదేశంలో పూర్తిగా అన్నం ఎక్కువ భుజిస్తారు
– ఉత్తర భారతంలో తక్కువగా అన్నం తింటారు
– ప్రపంచవ్యాప్తంగా ఆహారపు అలవాట్లలో వస్తున్న మార్పులకు అనుగుణంగా రైతులు పంటల సాగు చేయాలి
– రాష్ట్రంలో ఇప్పుడు పత్తి సాగు ప్రధానపంటగా మారింది .. తరువాత వరి పండిస్తారు
– వరి సాగులో సాంప్రదాయ పద్దతుల మూలంగా ఎకరాకు రూ.8 నుండి రూ.10 వేలు ఖర్చు అవుతుంది
– పెట్టుబడి ఖర్చు తగ్గించుకునే పద్దతులను రైతాంగం అవలంభించాలి
– రాబోయే తరాలు వరి నాట్లు వేసే అవకాశాలు లేవు .. అందుకే వ్యవసాయ పద్దతులు మారాలి
– ఆధునిక పద్దతులలో వరి సాగు మూలంగా కూలీల సమస్యను, అధిక పెట్టుబడితో పాటు విలువైన సమయం కూడా ఆదా అవుతుంది
– ఈ పద్దతిలో సాగు మూలంగా ఎకరాకు 1 నుండి 2 క్వింటాళ్ల దిగుబడి అధికంగా వచ్చే అవకాశం ఉంది
– వానాకాలంలో పది రోజులు, యాసంగిలో 10 రోజుల ఆదా మూలంగా యాసంగి పంటను వడగండ్ల వాన, ఇతర గాలి వానల మూలంగా కాపాడు కోగలుగుతాం
– ముందస్తుగా సీజన్ చేసుకోవడం మూలంగా ప్రకృతి విపత్తును రైతాంగం ఎదుర్కొనగలుగుతారు .. ప్రకృతిని ఎలాగూ ఆపలేం కాబట్టి ఆధునిక పద్దతులను అవలంభిచడమే మంచిది
– ఎకరా లోపు భూమి ఉన్న దాదాపు 17 లక్షల మందికి రూ.600 కోట్లు మొదటి రోజు రైతుబంధు నిధులు ఖాతాలలో జమ
– కరోనా మూలంగా ఆర్థిక వనరులు తక్కువ ఉన్నా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతులు ఇబ్బంది పడవద్దని రైతులకు రైతుబంధు నిధులు విడుదల
– ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు, తెలంగాణ రైతాంగానికి అభినందనలు
– ‘వరి నేరుగా విత్తుకునే పద్దతులపై’ టీ శాట్ ఛానల్ లో జరిగిన చర్చలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, రైతుబంధు సమితి అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, తెలంగాణ వరి పరిశోధన కేంద్రం ప్రిన్స్ పల్ సైంటిస్ట్ రఘురాం రెడ్డి గారు, శాస్త్రవేత్త హేమంత్ కుమార్ గారు