ప్రెస్ రిలీజ్
ప్లీస్ కవర్
ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా
తేది.15/06/2021, హైదరాబాద్
తొలి రోజు రైతుబంధు రూ.516.95 కోట్లు జమ
– 16.95 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి నిధులు
– నల్గొండ అత్యధికం లక్షా 11,970 రైతుల ఖాతాల్లోకి రూ.36.10 కోట్లు జమ
– ఆదిలాబాద్ అత్యల్పం 9628 మంది రైతుల ఖాతాల్లోకి రూ.35.60 లక్షలు
– రాష్ట్రవ్యాప్తంగా ఎకరా వరకు ఉన్న 10 లక్షల 33 వేల 915 ఎకరాలకు చెందిన 16 లక్షల 95 వేల 601 మంది రైతుల ఖాతాలకు నిధులు
– రెండవ రోజు రెండు ఎకరాల వరకు 23.05 లక్షల ఎకరాలకు గాను 15.07 లక్షల మంది ఖాతాల్లోకి జమ కానున్న రూ.1152.46 కోట్లు
– రెండవ రోజూ నల్గొండ రైతులే అత్యధికం లక్షా 10 వేల 407 మంది రైతుల ఖాతాలకు రూ.85.23 కోట్లు
– రైతుబంధు నిధులు రైతుల ఖాతాలలో జమవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, వ్యవసాయ శాఖ సిబ్బందికి, ఆర్థిక శాఖ సిబ్బందికి ధన్యవాదాలు, తెలంగాణ రైతాంగానికి అభినందనలు తెలిపిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు