పత్రికా ప్రకటన తేది. 23.06.2021
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డులలో జులై 1 నుండి నిర్వహించే పల్లె / పట్టణ ప్రగతి, తెలంగాణకు హరితహారం కార్యక్రమాలకు సంబంధించి సన్నాహక సమావేశాన్ని అధికారులతో బుధవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో నిర్వహించారు.
ఈ సమావేశంలో పల్లె / పట్టణ ప్రగతి, తెలంగాణకు హరితహారం అమలుపై సమగ్రంగా చర్చించారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ పల్లె / పట్టణ ప్రగతిపైన నివేదికలపై బుక్ లెట్ లుగా రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో పల్లె / పట్టణ ప్రగతి, తెలంగాణకు హరితహారం కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేసేందుకు ఆచరిస్తున్న వినూత్న పద్దతుల గురించి చర్చించారు. ఈ కార్యక్రమాల అమలుపై గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నివేదిక సమర్పించనున్నట్లు తెలిపారు. ఈ నెల 26వ తేదీన ప్రగతి భవన్ లో నిర్వహించనున్న జిల్లా కలెక్టర్ల సమావేశంలో చర్చించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు.
ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీ అర్వింద్ కుమార్, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా, సి.యంఓ కార్యదర్శి శ్రీమతి స్మితా సబర్వాల్, పిసిసిఎఫ్, శ్రీమతి శోభ, గ్రామీణాభివృద్ధి శాఖ కమీషనర్ శ్రీ రఘునందన్ రావు, జి.హెచ్.యం.సి కమీషనర్ శ్రీ లోకేశ్ కుమార్, పిసిసిఎఫ్ (ఎస్ఎఫ్) శ్రీ ఆర్.యం.డోబ్రియల్, పిసిసిఎఫ్ (CAMPA) శ్రీ లోకేశ్ జైస్వాల్, సి.యం ఓఎస్డి శ్రీమతి ప్రియాంకా వర్గీస్, సిడిఎంఏ శ్రీ సత్యనారాయణ, SPCL, సిఎండి శ్రీ రఘుమారెడ్డి, ట్రాన్స్ కో JMD శ్రీ శ్రీనివాస్ మరియు తదితర అధికారులు పాల్గొన్నారు.
—————————————————————————-
జారీచేసినవారు కమీషనర్, సమాచార పౌరసంబంధాల శాఖ, తెలంగాణ ప్రభుత్వం