Sri Somesh Kumar,IAS., Chief Secretary to Govt. held a meeting on Livelihood Programmes and Skill Development at BRKR Bhavan.

 

పత్రికా ప్రకటన                                                                తేది.10.06.2021

            రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ సంబంధిత శాఖాధిపతులతో జీవనోపాధి , నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలపై గురువారం బి.ఆర్.కె.ఆర్. భవన్ నందు సమావేశం నిర్వహించారు. వివిధ శాఖలు అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రధాన కార్యదర్శి సమీక్షించారు.  జీవనోపాధి , నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించి, అన్ని శాఖలు టీమ్ వర్క్ తో పనిచేయాలని సూచించారు.

                 ఈ సమావేశంలో ఐ.టి. శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ జయేష్ రంజన్, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి శ్రీ రాహుల్ బొజ్జా, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా, సాంకేతిక విద్య శాఖ కమీషనర్ శ్రీ నవీన్ మిట్టల్, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీమతి క్రిస్టినా చోంగ్తు, పంచాయతీ రాజ్ , గ్రామీణాభివృద్ధి శాఖ కమీషనర్ శ్రీ రఘునందన్ రావు, పరిశ్రమల శాఖ కమీషనర్ శ్రీ మానిక్ రాజ్, వి హబ్ సీఈఓ దీప్తి రావుల, ఫుడ్ ప్రాసెసింగ్ విభాగం డైరెక్టర్ శ్రీ అఖిల్ దవార్ తదితరులు పాల్గొన్నారు.

 —————————————————————————-

      జారీచేసినవారు కమీషనర్, సమాచార పౌరసంబంధాల శాఖ, తెలంగాణ ప్రభుత్వం

Share This Post