Sri Somesh Kumar,IAS., Chief Secretary to Govt. held a Meeting with Ayush Doctors at BRKR Bhavan.

PRESS NOTE

Dt.18-05-2021

As per the directions of the Honourable Chief Minister Sri K Chandrashekar Rao, Chief Secretary Sri Somesh Kumar, IAS held a meeting at BRKR Bhavan today with AYUSH Doctors on providing supplementary medication to treat Black Fungus disease.

Chief Secretary said that the Government is taking all the necessary steps to tackle black fungus disease in the state. Presently , The treatment for the disease is being taken up at Gandhi Hospital and Govt. ENT King Koti.

 Ayush doctors briefed Chief Secretary on the treatment protocols available in Ayurvedic, Homeopathi and Unani System of medicine. They informed Chief Secretary that Prophylactic Treatment for the black fungus will be given at Ayurvedic Hospital at Erragadda, Homeopathi Hospital at Ramanthapur and Unani Hospitals at Charminar and Erragadda.

Chief Secretary advised Ayush doctors to create awareness through             leaflets and press briefings regularly on treatment available in the Ayush hospitals where patients can approach.

Sri S.A.M.Rizvi, Secretary, Health & Family Welfare, Dr.Buddha Prakash M.Jyothi, Additional Chief Electoral Officer, Telangana, Dr.V.S.Alagu Varsini, Director, Department of Ayush, Dr.Gangadhar, Technical Advisor, Health Department, Dr.Srikant Babu, Principal, Ayurvedic College, Dr. Linga Raju, Dr.P. Navin, Prof. K.Rajani Chander, Prof. Ch. Srinivas Reddy of Homeopathy wing, Dr.Suresh Jakhotia, Dr. Praveen Kumar, Dr. Sailesh Nath Saxena of Ayurvedic wing, Prof. Bokhari, Prof. Salahuddin, Dr.M.H.Kazmi, Dr. Minhajuddin of Unani wing and other senior officials were present.

 

పత్రికా ప్రకటన 

                                                                                             తేది.18.05.2021

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ ఆయుష్ వైద్యులతో బ్లాక్ ఫంగస్ వ్యాధి చికిత్సకు అనుబంధంగా మందులు వినియోగించడం పై మంగళవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో సమావేశం నిర్వహించారు.

రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ వ్యాధి నిర్మూలనకు అవసరమైన అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటున్నదని ప్రధాన కార్యదర్శి అన్నారు. ఈ వ్యాధికి గాంధీ ఆసుపత్రి, ప్రభుత్వ ఇ.ఎన్.టి. ఆసుపత్రి కింగ్ కోఠి లలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

ఆయుర్వేద, హోమియోపతి మరియు యునాని వైద్య పద్ధతులలో లభించే చికిత్స విధానాలను గురించి ఆయుష్ వైద్యులు ప్రధాన కార్యదర్శికి ఈ సందర్భంగా వివరించారు. బ్లాక్ ఫంగస్‌కు చికిత్స ఎర్రగడ్డలోని ఆయుర్వేద ఆసుపత్రి, రామంతపూర్‌లోని హోమియోపతి ఆసుపత్రి, చార్మినార్, ఎర్రగడ్డలోని యునాని ఆసుపత్రులలో చికిత్స అందించబడతుందని ప్రధాన కార్యదర్శికి తెలిపారు.

ఆయుష్ ఆసుపత్రులలో అందుబాటులో ఉన్న చికిత్సపై ఎప్పటికప్పుడు కరపత్రాలు మరియు ప్రెస్ బ్రీఫింగ్‌ల ద్వారా పేషంట్లకు అవగాహన కల్పించాలని ప్రధాన కార్యదర్శి ఆయుష్ వైద్యులకు సూచించారు.

ఆరోగ్యశాఖ కార్యదర్శి శ్రీ రిజ్వి, తెలంగాణ అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ డాక్టర్ బుద్ధ ప్రకాష్ ఎం.జ్యోతి, ఆయుష్ విభాగం డైరెక్టర్ డా.అలగు వర్షిణి, ఆరోగ్య శాఖ సాంకేతిక సలహాదారు డా. గంగాధర్, ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీకాంత్ బాబు, హోమియోపతి డాక్టర్లు డా.లింగా రాజు, డా. పి. నవీన్, ప్రొఫెసర్ కె.రజని చందర్, ప్రొఫెసర్ సిహెచ్. శ్రీనివాస్ రెడ్డి , ఆయుర్వేద డాక్టర్లు డా. సురేష్ జఖోటియా, డా. ప్రవీణ్ కుమార్, డా. శైలేష్ నాథ్ సక్సేనా, యునాని డాక్టర్లు ప్రొఫెసర్ బొఖారీ, ప్రొఫెసర్ సలావుద్దీన్, డా. ఎం.హెచ్. కజ్మి, డా. మిన్హాజుద్దీన్ , అధికారులు పాల్గొన్నారు.

   ——————————————————————————————————————————————————–

      జారీచేసినవారు కమీషనర్, సమాచార పౌరసంబంధాల శాఖ, తెలంగాణ ప్రభుత్వం

 

Share This Post