పత్రికా ప్రకటన తేది.05.06.2021
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు, రాష్ట్రంలోని వివిధ బ్యాంకులలో పని చేస్తున్న అధికారులకు, సిబ్బందికి స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టి వ్యాక్సినేషన్ ను వారం రోజుల్లో పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శనివారం వివిధ బ్యాంకుల ప్రతినిధులతో బ్యాంక్ అధికారులు, సిబ్బంది వ్యాక్సినేషన్ పై బి.ఆర్.కె.ఆర్ భవన్ లో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి వ్యక్తికి వ్యాక్సిన్ అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి అభిలషిస్తున్నారని, అక్టోబర్ మాసాంతం నాటికి ఆ ప్రక్రియను పూర్తి చేసెందుకు ప్రభుత్వం తగు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మొదటి దశలో హై ఎక్స్ పోజర్ గ్రూప్స్ కు వ్యాక్సిన్ అందించామని, ఆ తర్వాత ప్రైవేట్ సెక్టార్ లో పనిచేస్తున్న వారికి దశల వారీగా వ్యాక్సిన్ ప్రక్రియను చేపట్టామని, ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం ద్వారా అధిక మొత్తంలో వ్యాక్సిన్ డోస్ లను పొందేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన అన్నారు.
ఈ సమావేశంలో ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ రామకృష్ణా రావు, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ అర్వింద్ కుమార్, పరిశ్రమల మరియు ఐటి శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీ జయేష్ రంజన్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీ రిజ్వీ, , SLBC కన్వీనర్ శ్రీ కృష్ణ శర్మ, చైర్మన్ APGVB శ్రీ ప్రవీణ్ కుమార్ , TSCOB మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్.మురళీధర్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
—————————————————————————-
జారీచేసినవారు కమీషనర్, సమాచార పౌరసంబంధాల శాఖ, తెలంగాణ ప్రభుత్వం