Sri Somesh Kumar,IAS., Chief Secretary to Govt. held a meeting with Officials

 

పత్రికా ప్రకటన                                                                తేది.04.06.2021

రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ ధరణి పోర్టల్ పై శుక్రవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో అధికారులతో సమీక్షించారు.

జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ  ధరణి పోర్టల్‌లో వచ్చిన ఫిర్యాదులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని, ప్రతిరోజూ పెండెన్సీ స్థితిని పర్యవేక్షించాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  ఆదేశించారు. వాట్సాప్, ఈమెయిల్ లతో పాటు అందిన అన్ని ఫిర్యాదులపై  స్పందించి,ఆయా ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ప్రధాన కార్యదర్శి తెలిపారు. భూ విషయాలకు సంబంధించిన మాడ్యూల్స్,  ధరణి పోర్టల్‌, ఇతర అంశాలను  ప్రధాన కార్యదర్శి సమీక్షించారు.

ఈ సమావేశంలో స్టాంపులు, రిజిష్ట్రేషన్ల CIG శ్రీ శేషాద్రి , ఆర్ధిక శాఖ స్పెషల్ సెక్రటరీ శ్రీ రోనాల్డ్ రోస్, వ్యవసాయ శాఖ కార్యదర్శి శ్రీ రఘునందన్ రావు, IRS, MD శ్రీ జి.టి వెంకటేశ్వర్ రావు, సి.సి.ఎల్.ఎ. ప్రత్యేక అధికారి సత్య శారదా  తదితర అధికారులు పాల్గొన్నారు.

—————————————————————————-

      జారీచేసినవారు కమీషనర్, సమాచార పౌరసంబంధాల శాఖ, తెలంగాణ ప్రభుత్వం

Share This Post