పత్రికా ప్రకటన తేది.15.06.2021
రాష్ట్రంలో అయిల్ పామ్ సాగు పట్ల గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు ఆసక్తిగా ఉన్నారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో ప్రగతిశీల, చైతన్యవంతులైన ఆసక్తికల రైతులు ఉన్నారని వారిని సెన్సిటైజ్ చేసి ఆయిల్ పామ్ సాగును చేపట్టేలా కృషి చేయాలని, దీనివల్ల దిగుమతుల కోసం అయ్యే వ్యయం తగ్గుతుందని ప్రధాన కార్యదర్శి అన్నారు.
రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు పెంచడంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులతో బి.ఆర్.కె.ఆర్ భవన్‌లో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. నర్సరీల ఏర్పాటు , నాణ్యమైన మొలకల దిగుమతి, రాష్ట్రంలో కర్మాగారాలు ఏర్పాటు చేయడానికి అవసరమైన ప్రైవేట్ సంస్థల గుర్తింపు మరియు ఇతర సౌకర్యాలు వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు.
ఈ సమావేశంలో ఐ.టి. శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ జయేష్ రంజన్, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా, వ్యవసాయ శాఖ కార్యదర్శి శ్రీ రఘునందన్ రావు, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీమతి క్రిస్టినా చోంగ్తు, టిఎస్ ఆయిల్‌ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సురేందర్, హార్టి కల్చర్ డైరెక్టర్ శ్రీ వెంకట్ రామి రెడ్డి, ఫుడ్ ప్రాసెసింగ్ డైరెక్టర్ శ్రీ అఖీల్, ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ బిజినెస్ డెవలప్ మెంట్ డైరెక్టర్ Ms. సుష్మ ఇతర అధికారులు పాల్గొన్నారు.
—————————————————————————-
జారీచేసినవారు కమీషనర్, సమాచార పౌరసంబంధాల శాఖ, తెలంగాణ ప్రభుత్వం