Sri Somesh Kumar,IAS., Chief Secretary to Govt. held a Tele-Conference with District Collectors.

 

                                                                     Press Note

                                                                                                                                     Dt.27.05.2021

As per the directions of the Hon’ble Chief Minister, Chief Secretary Shri Somesh Kumar conducted a teleconference with District Collectors today to review the arrangements for paddy procurement, vaccination of super-spreader categories and supply/availability of seeds and fertilizers.

In view of the expected early arrival of monsoon, District Collectors were directed to expeditiously complete the paddy procurement exercise within next 6 days.  Chief Secretary directed the Collectors to meet the shortage of labour and gunny bags by procuring from the local market. He advised them to ensure sufficient availability of vehicles for transport of paddy and keep a check on unwarranted cuts being imposed by the millers. He also directed the Secretary Civil Supplies to ensure smooth and seamless conduct of procurement operations.

The Collectors were further instructed to conduct a detailed review with their District Agriculture Officers and ensure sufficient availability of seeds/fertilizers at the point of sale.

With regard to the vaccination drive proposed for super spreader categories, the Collectors were informed to strictly follow the line list and limit vaccination to the categories decided by the Government. Further, they were also directed to carefully ensure administration of only Covishield vaccine to these categories.

The teleconference was attended by Sri SAM Rizvi, Secretary Health, Sri M Raghunandnan Rao, Secretary Agriculture and Sri V Anil Kumar Commissioner Civil Supplies.

 

                                                                    పత్రికా ప్రకటన                                                                                                                                                                                                              తేది.27.05.2021

          గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ వరి సేకరణ, సూపర్ స్ప్రెడర్ వర్గాలకు టీకాలు వేయడం, విత్తనాలు, ఎరువుల సరఫరా మరియు లభ్యత ఏర్పాట్లపై సెక్రటేరియట్ నుండి గురువారం జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి, సమీక్షించారు.

త్వరలో రాష్ట్రంలో రుతుపవనాలు ప్రవేశించనున్నందున రాబోయే 6 రోజుల్లో ధాన్యం సేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. స్థానిక మార్కెట్ ల నుండి  కార్మికులను సమీకరించుకోవాలని , గోనె సంచులు (గన్నీ బ్యాగ్స్) సేకరించాలని కలెక్టర్లను ఆదేశించారు.కొనుగోలు కేంద్రాల నుండి సేకరించిన ధాన్యం రవాణాకు వాహనాలు తగినంతగా లభించేలా చూడాలని, మిల్లర్లు తూకాలలో విధిస్తున్న అనవసర కోతలను అరికట్టేందుకు తనిఖీలు చేయాలని వారికి సూచించారు. గోనె సంచుల సేకరణ ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని పౌర సరఫరాల శాఖ కార్యదర్శిని ఆదేశించారు.

విత్తనాలు మరియు ఎరువులు విక్రయాల  సమయంలో తగినంత నిల్వలు అందుబాటులో ఉండాలని తెలిపారు. తదనుగుణంగా జిల్లా వ్యవసాయ అధికారులతో సవివరమైన సమీక్ష నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు.

సూపర్ స్ప్రెడర్ కేటగిరీల కోసం ప్రతిపాదించిన టీకా డ్రైవ్‌కు సంబంధించి, ప్రభుత్వం నిర్దేశించిన వర్గాలకు టీకాలు వేయాలని, లైన్ జాబితాను ఖచ్చితంగా పాటించాలని కలెక్టర్లకు సూచించారు. అంతేకాకుండా, ఈ వర్గాలకు కోవిషీల్డ్ వ్యాక్సిన్ మాత్రమే వేయడాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని ప్రధాన కార్యదర్శి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

ఈ టెలికాన్ఫరెన్స్ లో వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి శ్రీ ఎస్.ఎ.ఎమ్ రిజ్వీ, వ్యవసాయ  శాఖ కార్యదర్శి శ్రీ ఎం. రఘునందన్ రావు మరియు పౌర సరఫరాల శాఖ కమిషనర్ శ్రీ వి. అనిల్ కుమార్ పాల్గొన్నారు.

   —————————————————————————-

      జారీచేసినవారు కమీషనర్, సమాచార పౌరసంబంధాల శాఖ, తెలంగాణ ప్రభుత్వం

Share This Post