Dt.07-06-2021
PRESS NOTE
As per the directions of Hon’ble Chief Minister Sri K.Chandrashekhar Rao, Sri Somesh Kumar, IAS, Chief Secretary, held a teleconference with the District Collectors, DMHOs and Superintendents of Government General Hospitals of Bhadradri-Kothagudem, Karimnagar, Khammam, Nalgonda and Suryapet districts on Covid situation, tests, Positivity and bed occupancy in the hospitals.
Chief Secretary reviewed the situation and instructed the collectors to prepare a plan and pay special attention on control of covid-19 in the villages and specific areas in the districts where more cases were reported. Chief Secretary directed to focus on border villages and take preventive measures duly increasing tests.
Sri S.A.M.Rizvi, Secretary Health and Family Welfare, Dr. Srinivas Rao, Director Public Health, Dr. Gangadhar, OSD to Hon’ble Chief Minister participated in the review meeting.
పత్రికా ప్రకటన తేది.07.06.2021
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ మరియు సూర్యాపేట జిల్లాలో కోవిడ్ పరిస్ధితి, టెస్టులు, పాజిటివిటి, ఆసుపత్రులలో బెడ్ల ఆక్యుపెన్సీలపై జిల్లా కలెక్టర్లు, DMHO లు, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రుల సూపరిండెంట్ల తో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆయా జిల్లాలలో నెలకొన్న కోవిడ్ పరిస్ధితులను సమీక్షించి, కేసులు ఎక్కువగా వస్తున్న ప్రాంతాలు, గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, కోవిడ్ నివారణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలని ఆదేశించారు. సరిహద్దు గ్రామాలపై దృష్టి సారించి నివారణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశిచారు.
ఈ టెలికాన్ఫరెన్స్ లో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీ రిజ్వీ, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, శ్రీనివాస్ రావు, ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎస్ డి డా. గంగాధర్ లు పాల్గొన్నారు.
—————————————————————————-
జారీచేసినవారు కమీషనర్, సమాచార పౌరసంబంధాల శాఖ, తెలంగాణ ప్రభుత్వం