Sri Somesh Kumar,IAS., Chief Secretary to Govt. visited ENT Hospital, Koti.

 

పత్రికా ప్రకటన                                                                                                                  తేది.27.05.2021

          రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ గురువారం ఆరోగ్య కార్యదర్శి శ్రీ S.A.M. రిజ్వీ, వైద్య విద్య డైరెక్టర్ డాక్టర్ రమేష్ రెడ్డి తో కలిసి కోఠి ENT ఆసుపత్రిని సందర్శించి, పేషంట్లతో మాట్లాడారు. బ్లాక్ ఫంగస్ పేషంట్లకు చేస్తున్న శస్త్రచికిత్సలు, అందిస్తున్న చికిత్సలను వైద్యులతో సమీక్షించారు.

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు, ప్రధాన కార్యదర్శి ENT ఆసుపత్రిని సందర్శించి, ప్రతి వార్డుకు వెళ్లి పేషంట్లకు అందిస్తున్న వైద్య సేవలు గురించి తెలుసుకున్నారు.  ఉత్తమ చికిత్సను అందించడానికి ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు   భయపడవద్దని కోరారు.

హైదరాబాద్‌లోని కోఠి ఇ.ఎన్‌.టి హాస్పిటల్ ను బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం నోడల్ హాస్పిటల్‌గా గుర్తించి, 250 పడకలతో తగిన సౌకర్యాలు, మెడిసిన్స్ ను అందుబాటులో ఉంచినట్లు ప్రధాన కార్యదర్శి తెలిపారు. ప్రతి రోజు, ఈ ఆసుపత్రిలో 20 శస్త్రచికిత్సలు నిర్వహించబడుతున్నాయని మరియు శస్త్రచికిత్సలను పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఇది కాకుండా సరోజినిదేవి కంటి హాస్పిటల్ లో కూడా చికిత్సలు ప్రారంభించడానికి సిద్ధంగా ఉందని, ప్రస్తుతo పరిస్థితి అదుపులో ఉందని తెలిపారు.

ఈ పర్యటనలో  CM OSD శ్రీ గంగాధర్, టి.ఎస్.ఎం.ఎస్.ఐ.డి.సి, మేజేజింగ్ డైరెక్టర్ శ్రీ చంద్రశేఖర్ రెడ్డి,  ENT హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ టి. శంకర్ ఇతర అధికారులు ఉన్నారు.

   —————————————————————————-

      జారీచేసినవారు కమీషనర్, సమాచార పౌరసంబంధాల శాఖ, తెలంగాణ ప్రభుత్వం

Share This Post