Sri T.Harish Rao, Hon’ble Minister for Finance and other Hon’ble Ministers held a meeting on cultivation of Oil Palm in the State.

 

పత్రికా ప్రకటన                                                                తేది.14.06.2021

            గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు, ఆర్థిక శాఖ మంత్రి శ్రీ టి.హరీష్ రావు, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి శ్రీ ఎ.ఇంద్రకరణ్ రెడ్డి,  వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ లతో కలసి సోమవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో నిర్వహించిన సమావేశంలో రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు పెంపు పై చర్చించారు.

రాబోయే సంవత్సరాల్లో ఆయిల్ పామ్ సాగును రాష్ట్రంలో పెద్ద ఎత్తున చేపట్టనున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి శ్రీ టి.హరీష్ రావు తెలిపారు. 2022 వ సంవత్సరంలో ఆయిల్ పామ్ సాగును భారీ స్థాయిలో చేపట్టుటకు ఇప్పటి నుండే ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. పర్యావరణ అనుకూలమైన ఆయిల్ పామ్ సాగుతో రైతులకు ఎక్కువగా ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. ఆయిల్ పామ్ నర్సరీలను పెంచడానికి చర్యలు తీసుకోవాలని వివిధ శాఖల అధికారులను కోరారు, ఆయిల్ పామ్ విస్తీర్ణాన్ని పెంచడంలో మొక్కల లభ్యతే ప్రధాన అంశమని మంత్రి పేర్కొన్నారు.

శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంఎల్సి మరియు చైర్మన్, రైతు సమన్వయ సమితి, శ్రీ రఘునందన్ రావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి, శ్రీ సురేందర్, ఎండి, టిఎస్ ఆయిల్‌ఫెడ్, శ్రీ వెంకట్ రామి రెడ్డి, హార్టికల్చర్ డైరెక్టర్, శ్రీ వై.కృష్ణరావు, సిజిఎం ,NABARD, శ్రీ సంతానం, డిజిఎం, NABARD, శ్రీ మురళీధర్, ఎండి, TSCOB తదితరులు పాల్గొన్నారు.

 —————————————————————————-

      జారీచేసినవారు కమీషనర్, సమాచార పౌరసంబంధాల శాఖ, తెలంగాణ ప్రభుత్వం

Homepage

Share This Post