Sri V.Srinivas Goud, Hon’ble Minister for Sports and Tourism & Culture review on Sports.

                                                                  పత్రికా ప్రకటన,                                                     

                                                                                                                                    తేది. 27.05.2021.

 

రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు హైదరాబాద్ లోని తన కార్యాలయంలో రాష్ట్ర క్రీడా శాఖ పై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ… గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి పై ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ కి క్రీడా ప్రాధికార సంస్థ (SATS) లో వివిధ క్రీడాoశాలలో కోచ్ లుగా సేవలు అందిస్తున్న కోచ్ ల వివరాలను, కోచ్ సర్వీస్ ను  రెగ్యులరైజ్ చేయడానికి క్యాబినెట్ సబ్ కమిటీ కి వెంటనే ప్రతిపాదనలు సమర్పించాలని మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు SATS MD ని ఆదేశించారు.

ఈ సమీక్షా సమావేశంలో జాతీయ, స్థాయిలో రాణించిన క్రీడాకారులను, టోక్యో ఒలంపిక్స్ లో పాల్గొనే క్రీడాకారులకు హైదరాబాద్ లోని SATS ఆధ్వర్యంలో ఉన్న 5 క్రీడా మైదానాలలో క్రీడాకారులకు కోవిడ్ నివారణకు యుద్ధ ప్రాతిపదికన వాక్సినేషన్ ను వేయాలని క్రీడా శాఖ కార్యదర్శి ని మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు ఆదేశించారు. వాక్సినేషన్ కు అవసరమైన ఏర్పాట్లు ను చేయాల్సిందిగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి గారికి లేఖ రాయాలని మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు క్రీడా శాఖ కార్యదర్శి గారిని ఆదేశించారు.

ఈ సమీక్షా సమావేశంలో వరంగల్, కరీంనగర్ లలో SATS ఆధ్వర్యంలో చేపడుతున్న మల్టీ పర్పస్ స్టేడియం నిర్మాణ పనులు, సింథటిక్ ట్రాక్ పనులు వేగవంతం గా పూర్తి చేయాలని మంత్రి శ్రీ. V. శ్రీనివాస్ గౌడ్ గారు SATS అధికారులను ఆదేశించారు.

ఖేలో ఇండియా లో భాగంగా రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన ల అభివృద్ధి కి కేంద్ర క్రీడా శాఖ కు వెంటనే తగిన ప్రతిపాదనలను పంపాలని మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు రాష్ట్ర క్రీడా శాఖ MD ని ఆదేశించారు.

గచ్చిబౌలి క్రీడా మైదానం అభివృద్ధి కి ప్రత్యేక ప్రతిపాదనలను ప్రముఖ క్రీడా కన్సల్టెంట్స్ ద్వారా ప్రతిపాదనలను తయారు చేసి కేంద్ర క్రీడా శాఖకు పంపించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, క్రీడా శాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు  ప్రతిష్టాత్మకంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో క్రీడా మైదానాల నిర్మాణము లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు SATS MD ని ఆదేశించారు.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా లోని నారాయణ పెట, అచ్చంపేట నియోజకవర్గంలో అసంపూర్తిగా ఉన్న నిర్మాణ పనులను వెంటనే వేగవంతం చేసి నిర్మాణ పనులను పూర్తి చేయాలని మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు స్పోర్ట్స్ అధికారులను ఈ సమావేశంలో ఆదేశించారు.

ఈ సమీక్ష సమావేశం లో క్రీడా, పర్యాటక, సంస్కృతిక శాఖ ప్రభుత్వ కార్యదర్శి శ్రీ KS శ్రీనివాస రాజు, క్రీడా శాఖ ఉన్నతాధికారులు సుజాత, చంద్రావతి, వెంకయ్య, దీపక్ లు పాల్గొన్నారు.

Share This Post