SRR కళాశాలలో ఉప ఎన్నికల లో పోటీ చేసిన అభ్యర్థులు వారి ప్రథినిధులతో స్క్రూటినీ సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ ఆర్ వి కర్ణన్, సాధారణ ఎన్నికల పరిశీలకులు, ఎలక్షన్ రిటర్నింగ్ అధికారి రవీందర్ రెడ్డి.

 

హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహణ

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్ వి కర్ణన్

అభ్యర్థుల సమక్షంలో స్క్రూటినీ

నవంబర్ 2న కౌంటింగ్
00000

హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికల పోలింగ్ సజావుగా, నిష్పక్షపాతంగా, శాంతియుతంగా నిర్వహించామని జిల్లా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్ వి కర్ణన్ తెలిపారు. ఆదివారం ఎస్.ఆర్.ఆర్ ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాలలోనీ కౌంటింగ్ కేంద్రంలో ఉప ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, వారి ప్రతినిధుల సమక్షంలో స్క్రుటిని నిర్వహించారు. కేంద్ర ఎన్నికల సాధారణ పరిశీలకుడు ముత్తు కృష్ణ న్ శంకర్ నారాయణ తో కలిసి స్క్రూటినీ నిర్వహించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సరళి, ఓటింగ్ శాతం పై అభ్యర్థులకు వివరించారు. మాక్ పోలింగ్, పి ఓ డైరీ, ఏ. ఎస్.డి. ఓటర్లు, బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వివి ప్యాట్లు, పోస్టల్ బ్యాలెట్ లు, సర్వీస్ ఓట్లు తదితర అంశాలపై అభ్యర్థులకు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఉప ఎన్నిక పోలింగ్ సజావుగా జరిగేందుకు సహకరించిన రాజకీయ పార్టీలకు, పోటీ చేసిన అభ్యర్థులకు కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా ముగిసినందున నవంబర్ 2వ తేదీన ఎస్.ఆర్.ఆర్ ప్రభుత్వ డిగ్రీ పిజి కళాశాలలో కౌంటింగ్ నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర ఎన్నికల సాధారణ పరిశీలకుడు ముత్తు కృష్ణన్ శంకర్ నారాయణ, అదనపు కలెక్టర్ జీవీ శ్యామ్ ప్రసాద్ లాల్, హుజురాబాద్ రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో సిహెచ్ రవీందర్ రెడ్డి, ఉప ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, వారి ప్రతినిధులు పాల్గొన్నారు.

 

Share This Post