SRR కళాశాలలో కౌంటింగ్ సిబ్బంది శిక్షణ తరగతుల లో మాట్లాడుతున్న జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్ వి కర్ణన్.

ఎన్నికల ఓట్ల లెక్కింపు పకడ్బందీగా నిర్వహించాలి

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్ వి కర్ణన్

-000-

హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నిక సందర్భంగా నవంబర్ 2 వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపును పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అన్నారు. సోమవారం కరీంనగర్ ఎస్ ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాలలో ఎన్నికల కౌంటింగ్ సిబ్బందికి ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులకు కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఓట్లను లెక్కించాలని,కౌంటింగ్ సిబ్బందికి సూచించారు. వివి ప్యాట్ ల లోని స్లిప్పు లను కూడా లెక్కించాల్సి ఉంటుందని, బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వివి ప్యాట్ ల లెక్క సరిగా ఉండాల్సి ఉంటుందని అన్నారు. ఫారం 17సి నీ చెక్ చేయాలని తెలిపారు. అనంతరము కౌంటింగ్ కేంద్రంలోనీ ఏర్పాట్లను ఎన్నికల సాధారణ పరిశీలకుడు ముత్తు కృష్ణన్ శంకర్ నారాయణ, అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్ తో కలిసి పరిశీలించారు. కళాశాలలో ఏర్పాటు చేసిన కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ ను పరిశీలించి వైద్య సిబ్బంది తో మాట్లాడారు. రెండో తీసుకొని వారందరికి వ్యాక్సినేషన్ ఇవ్వాలని సిబ్బందిని ఆదేశించారు. ఓట్ల లెక్కింపు కార్యక్రమం లో కౌంటింగ్ మైక్రో అబ్జర్వర్ ల పాత్ర కీలకమని అన్నారు. కౌంటింగ్ హాల్ లో కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ సిబ్బంది, కౌంటింగ్ అసిస్టెంట్ లను నిశితంగంగా పరిశీలించాలని మైక్రో అబ్జర్వర్లకు సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎన్నికల సాధారణ పరిశీలకుడు ముత్తు కృష్ణన్ శంకర్ నారాయణ, అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్ , ఆర్డీవో ఆనంద్ కుమార్, తహసిల్దార్లు , అధికారులు పాల్గొన్నారు.

Share This Post