SRR ప్రభుత్వ డిగ్రీ,పీజీ కళాశాలలో స్థానిక సంస్థల MLC ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలిస్తున్న రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్ పాల్గొన్న అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కు
అన్ని ఏర్పాట్లు పూర్తి

జిల్లా ఎన్నికల అధికారి ఆర్.వి. కర్ణన్
000000

జిల్లాలో మంగళవారం జరుగు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ తెలిపారు.

సోమవారం సాయంత్రం ప్రభుత్వ ఎస్.ఆర్.ఆర్. డిగ్రీ, పీజీ కళాశాలలో ఏర్పాటు చేసిన 7 కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఉదయం 8.00 గంటలకు ప్రారంభమవుతుందని తెలిపారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపుకు 8 టేబుళ్లను ఏర్పాటు చేశామని అన్నారు. 24 మంది కౌంటింగ్ సిబ్బందిని నియమించామని, ఒక్కొక్క టేబుల్ కు ఒక కౌంటింగ్ సూపర్వైజర్, ఒక కౌంటింగ్ అసిస్టెంట్, ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారని తెలిపారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో 1324 ఓటర్లు ఉండగా, 1320 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని ఆయన తెలిపారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 10 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ను పకడ్బందీగా పారదర్శకంగా నిర్వహిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్, కరీంనగర్ ఆర్.డి.వో. ఆనంద్ కుమార్, అర్భన్ తహశీల్దార్ సుధాకర్, కొత్తపల్లి తహశీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Share This Post