T Hub success story

నిరు పేద ప్రజలకు వైద్య సేవలకు  ప్రభుత్వ  ఆసుపత్రులే దేవాలయాలు. పూట గడవడమే గగనమైన నిరుపేదలు సుస్థి చేస్తే ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తే ఇల్లు వళ్ళు గుల్ల అయ్యే పరిస్థితులు. ప్రభుత్వం  నిరుపేదలకు కార్పోరేట్ వైద్య సేవలు అందుబాటులోకి  తెచ్చింది.  ఎటువంటి వ్యాధి సోకుతుందనేది ప్రాథమికంగా నిర్దారణ చేయడం వల్ల వైద్య సేవలు మరింత సులువుగా అందించాలనే  ఆశయంతో ప్రభుత్వం దాదాపు 48 రకాల రక్త పరీక్షలు నిర్వహించేందుకు జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రిలో 38 లక్షల రూపాయల వ్యయంతో తెలంగాణ టి హబ్ ఏర్పాటు చేసింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ టి హబ్ ను లాంఛనంగా ప్రారంభించి పేదలకు ఉచిత రక్త పరీక్షలు అందుబాటులో తెచ్చారు.  నిరుపేదలపరీక్షలన్నీ ప్రభుత్వ ల్యాబ్లోనే చేస్తున్నారు. అత్యాధునిక పరికరాలతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రానికి  ప్రతి రోజూ నాలుగు రూట్లను కేటాయించి 28  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుండి ప్రజల నుండి రక్తపు శాంపిళ్ల సేకరణ చేస్తున్నారు.   వచ్చే నెల నుంచి మరో రెండు రూట్లకు అనుమతి రానున్నది.  రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ రోగ నిర్ధారణ పరీక్షా కేంద్రం (హబ్)లో 48 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తున్నారు. హబ్ ప్రారంభం నుంచి రోజూ సుమారు 300 మంది నుండి రక్త పూతలు సేకరించి, మరుసటి రోజు రోగ నిరార్ధణ పరీక్షలు చేసి, రిపోర్టులను పేషేంట్ల మొబైల్ కి  మెసేజ్ చేస్తున్నారు. ఇవే పరీక్షలు  ప్రైవేటు ల్యాబ్ లో  చేస్తే కనీసం  7 వేలు రూపాయలు ఖర్చయ్యే పరిస్థితి.   కరోనా ప్రొ ఫైల్ పరీక్షలు కూడా టి హబ్ లో చేస్తున్నారు. మార్చి 10న జిల్లాలో తెలంగాణ రోగ నిర్ధార్ధణ పరీక్ష కేం ద్రం ప్రారంభమైంది. జిల్లాలో ప్రస్తుతం నాలుగు వాహనాలు ఏర్పాటు చేసి, పీహెచ్సీలు, ప్రభుత్వ ఆస్పత్రుల నుంచి రక్త నమూనాలు సేకరించి హబ్ కు తరలించి పరీక్షలు చేస్తున్నారు. టి హబ్ లో నిర్వహించే పరీక్షలు ఇవే. షుగర్,  బ్లడ్ పీఛర్స్,  లివర్, కిడ్నీ, కోలెస్ట్రాల్, డెంగి,  లిపిడ్ ప్రొఫైల్,  విడీఆర్ఎల్, ఆర్ఎ, సీఆర్పి ర్యాపిడ్ టెస్టు హెచ్ఐబిఎవన్సీ, కోవిడ్ ప్రొఫైల్ డిడైమర్, పెర్టిన్,  ఎల్డీహెచ్ తదితర పరీక్షలు చేస్తున్నారు.  హబ్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 15,881 మంది పేషెంట్లకు 45,714 రకాల పరీక్షలు చేశారు. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 250 నుంచి 350 మంది నుండి సేకరించిన 400 రకాల రక్త శాంపిళ్లు హబ్ కు వస్తున్నాయి. హబ్ లో 1.50 కోట్ల విలువైన అధునాతన పరికరాలను ఏర్పాటు చేశారు. ఎబాట్ ఆర్కిటెక్చర్,  అర్చితేచ్ (బయోకెమిస్ట్రీ, హార్మోన్ పరీక్షలు) మిండ్ రే (హిమోగ్లోబిన్,   ప్లేట్లెట్), ఎలీసా (డెంగీ, చికెన్ గున్యా సంబంధిత) పరీక్షలు చేసే యంత్రాలు ఏర్పాటు చేశారు.  జిల్లాలో ప్రస్తుతం నాలుగు వాహనాల ద్వారా నాలుగు రూట్లలో ప్రతి రోజు శాంపిల్స్ సేకరిస్తున్నారు.  ఇల్లెండు, పాల్వంచ, ఆళ్లపల్లి, కొత్తగూడెం. నాలుగు రూట్లుగా ఏర్పాటు చేసి రోజూ 28 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుండి  రక్త పూతలు సేకరించి, హహబ్ కు పంపుతున్నారు. అక్టోబర్ మాసం నుండి మరో రెండు రూట్లలో నమూనాలు సేకరణ చేయాలని ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అశ్వారావుపేట, మణుగూరు, దమ్మపేట, భద్రాచలం ప్రాంతాల నుంచి కూడా రెండు వాహనాల ద్వారా నమూనాలు సేకరణ చేయనున్నారు.  మొత్తం 48 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుండి   రక్త పూతలు సేకరించి, హబ్ కు పంపనున్నారు. మారుమూల గ్రామలున్న ఈ జిల్లాలో గిరిజన ప్రజలు అధిక సంఖ్యలో నివసిస్తున్నారు. ఈ ప్రాంత ప్రజలు అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు  జిల్లా కలెక్టర్ అనుదీప్ తీసుకున్న  ప్రత్యేక చొరవ సత్ఫలితాలను ఇస్తుంది.  రక్త నమూనాలు పరీక్ష ద్వారా మహమ్మారి వ్యాధులను. ముందుగానే పసిగట్టి టి హబ్ ద్వారా వేల రూపాయల విలువ చేసే పరీక్షలు నిరుపేద ప్రజలకు అందుబాటులోకి రావడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Share This Post