T-SAT – Press Release

పత్రిక ప్రకటన                                                                                 16.05.2021

ఈ నెల 18న టి-సాట్ స్టూడియోకు మంత్రి నిరంజన్ రెడ్డి
(టి.సాట్-సాఫ్ట్ నెట్)
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఈ నెల 18వ తేదీ మంగళవారం రోజున జూబ్లీహిల్స్ లోని టి-సాట్ స్టూడియోకు హాజరవనున్నారు. ‘వానా కాలం సాగుకు సమాయత్తం’ పేరు తో వ్యవసాయ శాఖ చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నాం ఒంటి గంట వరకు రెండు గంటల పాటు తెలంగాణ రైతులకు ప్రత్యేక ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం ద్వార పలు సలహాలు-సూచనలు అందివ్వనున్నారు. ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల సమయంలో క్షేత్ర స్థాయిలో ఉన్న రైతులకు వానా కాలం సాగు విషయంలో పలు అంశాలపై టి-సాట్ టీవి, నెట్వర్క్ ద్వార అవగాహన కల్పించేందుకు మంత్రి నిరంజన్ రెడ్డి సిద్ధమయ్యాయారు. ఈ నెల 18వ తేదీ మంగళవారం జరిగే ప్రత్యేక లైవ్ షో కార్యక్రమంలో మంత్రితో పాటు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్థన్ రెడ్డి ఇతర సాంకేతిక అధికారులు పాల్గొని రైతులకు తగిన సలహాలు-సూచనలు అందివ్వనున్నట్లు టి-సాట్ సీఈవో ఆర్.శైలేష్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మంత్రి నిరంజన్ రెడ్డి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు నిపుణ, విద్యతో పాటు టి-సాట్ యూట్యూబ్ tsatnetwork/youtube, యాప్ tsat.tv వేదిక ద్వార లైవ్ అందుబాటులో ఉంటుందని, ఈ అవకాశాన్ని తెలంగాణ రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు సద్వినియోగం చేసుకోవాలని శైలేష్ రెడ్డి కోరారు.

Share This Post