Tags: ములుగు

పకడ్బందీగా 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణ – రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి  *ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఏ.ఎన్.ఎం. అందుబాటులో ఉండాలి  *పరీక్షల దృష్ట్యా ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపాలి  *పోలీస్ బందోబస్తుతో ప్రశ్నపత్రాల తరలింపు  విద్యార్థులు మానసిక ఒత్తిడి గురికాకుండా  ప్రశాంతంగా పరీక్ష రాసే దిశగా చర్యలు  పదవ  తరగతి పరీక్షల నిర్వహణ పై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి

జిల్లాలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పదవ తరగతి పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ సెక్రెటరీ వాకాటి కరుణ, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీ దేవసేన, ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు ఇంటర్మీడియట్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లా కలెక్టరేట్ లోని వీడియో సమావేశం హాలు నుంచి *జిల్లా…

ఇంటిగ్రెటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ (IDOC) నిర్మాణ పనులలో వేగం పెంచి ఏప్రిల్ నెలాఖరుకు సి బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్, మొదటి స్లాబ్ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ యస్. క్రిష్ణ ఆదిత్య అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రక్కన ఇంటిగ్రెటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణ పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య క్షేత్ర స్థాయిలో తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఐడిఓసి నిర్మాణా పనులను పరిశీలించిన…

ప్రజావాణి అర్జీలను  వెంటనే పరిష్కారించాలి.    జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య.

ప్రజావాణి అర్జీలను వేంటనే పరిష్కారించాలని జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్, లోకల్ బాడీ ఇలా త్రిపాఠీ, డిఆర్వో రమాదేవి లతో కలిసి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను కలెక్టర్ నేరుగా స్వీకరించారు. సంబంధిత శాఖలకు సిఫారసు చేశారు. కొన్నింటిని సత్వరమే పరిష్కరించారు. ప్రజావాణిలో మొత్తం దరఖాస్తులు 36 రాగా అందులో 15 రెవిన్యూ శాఖకు సంబంధించినవి, జిల్లా…

మన ఊరు మనబడి కార్యక్రమంలో ఎంపిక చేయబడిన పాఠశాలల అభివృద్ధి పనులు మార్చి 31 వరకు పూర్తి చేయాలి.   జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఎంపిక చేయబడిన పాఠశాలలో అభివృద్ధి పనులు మార్చి 31 వరకు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో మన ఊరు మన బడి అభివృద్ధి పనులపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 31 వరకు మన…

రోడ్డు ప్రమాదాలు నియంత్రించాలి .  సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి.  మూల మలుపుల వద్ద స్పీడ్ బ్రేకర్లు తప్పనిసరి.   జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య.

రోడ్డు ప్రమాదాలు నియంత్రించాలి . సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి. మూల మలుపుల వద్ద స్పీడ్ బ్రేకర్లు తప్పనిసరి. జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య. ** రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ ఛాంబర్ లో రోడ్డు రవాణా సంస్థ, పోలీస్ శాఖ అధికారులతో రోడ్డు ప్రమాదాల నివారణకు అందుకు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య…

ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రం పరిశీలన .  ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మికంగా తనిఖీ.  అంగన్వాడి సెంటర్  సందర్శన.  వెంకటాపూర్ మండలంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య.

వెంకటాపూర్ మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలపై జిల్లా కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ వెంకటాపూర్ మండలం తళ్ళపాడు వద్ద ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్మీడియట్ పరీక్ష సెంటర్ ను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, అంగన్వాడి సెంటర్ ను ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్ష సెంటర్ ను అన్ని రూములు కలియ తిరుగుతూ విద్యార్థులు పరీక్షలు రాస్తున్న…

ఘనంగా అంతర్జాతీయ మహిళ దినోత్సవం.  జిల్లాలో ఉమ్మడి గ్రామైక్య సంఘాల ద్వారా యూనిట్లు పెంచాలి.  మహిళలు వ్యాపారంలో రాణించాలి.  బ్యాంకు లింకేజీ వడ్డీ రాయితీ గట్టమ్మ గ్రామైక్య సంఘానికి చెక్కు పంపిణీ.  వివిధ మహిళా సంఘాల ద్వారా ఏర్పాటుచేసిన వస్తువు తయారీ  స్టాల్స్ ప్రారంభం.  మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య.

జిల్లాలో మహిళా సంఘాల ద్వారా ఉమ్మడి వ్యాపారాలు ఎక్కువ యూనిట్లను పెంచి వ్యాపారంలో మహిళలు రాణించాలని జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళ దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్, జడ్పీ వైస్ చైర్మన్ బడే నాగజ్యోతితో కలసి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ…

సంత్ సేవాలాల్ మహారాజ్ చూపిన మార్గంను  అనుసరించాలి : జిల్లా కలెక్టర్ యస్. క్రిష్ణ ఆదిత్య.

సంత్ సేవాలాల్ మహారాజ్ చూపిన మార్గంలో నడుస్తూ, ఆయన ఆశయాల సాధనకు కృషి చేసినప్పుడే ఆ మహనీయుడికి నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుందని జిల్లా కలెక్టర్ యస్. క్రిష్ణ ఆదిత్య అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో శ్రీశ్రీశ్రీ సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ వారి 284 జయంతి ముగింపు వేడుకలు ఘానంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ యస్. క్రిష్ణ ఆదిత్య సంత్ సేవాలాల్ జయంతి పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ 18…

అందరి కృషి వల్ల జిల్లా మారింది  స్వచ్ఛభారత్ మిషన్ ఫేస్ 2 అవగాహన శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య.  **

ప్రతి గ్రామ పంచాయతీ పరిధి లో ప్రజా ప్రతినిధులు కార్యదర్శి గ్రామపంచాయతీ సిబ్బంది కృషి వల్ల అన్ని గ్రామ పంచాయతీలో అభివృద్ధి సాధించమని జిల్లా ఎస్ కృష్ణ ఆదిత్య అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని గిరిజన భవనంలో స్వచ్ఛభారత్ మిషన్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు స్వచ్ఛ భారత్ మిషన్ రెండు గుంతల మరుగుదొడ్ల నిర్మాణం పై అవగాహన శిక్షణ కార్యక్రమం కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అందరి కృషి…

ములుగు జిల్లా. ప్రతి ఇంటికి తాగునీరు అందించాలి కాలువలు పునరుద్ధరించాలి ప్రతి గ్రామంలో చివరి ఆయకట్టు వరకు నీరందించాలి కంటి వెలుగు కార్యక్రమ నివేదిక పకడ్బందీగా రూపొందించాలి పౌష్టికాహార లోపం ఉన్న పిల్లలకు పౌష్టికాహారం అందించాలి పెండింగ్ ఆర్జీలను సత్వరమే పరిష్కరించాలి ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య

వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో ప్రతి ఇంటికి తాగునీరు అందించాలని కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి స్థానిక సంస్థలు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వైవి గణేష్ ల తో కలిసి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను కలెక్టర్ నేరుగా స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 29 దరఖాస్తులు రాగా అందులో 11 భూమి సమస్యలు…