Tags: రాజన్న సిరిసిల్ల

*ప్రచురణార్థం-3* రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 03: నర్సరీల్లో డిమాండ్ ఉన్న మొక్కల పెంపకం చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్య ప్రసాద్ ఆదేశించారు. గురువారం అదనపు కలెక్టర్ వేములవాడ పట్టణ నర్సరీని తనిఖీ చేశారు. ప్రజలకు పంపిణీకి వీలుగా వారు కోరుతున్న పండ్ల, పూల మొక్కల పెంపకం చేయాలన్నారు. పట్టణంలో అవెన్యూ ప్లాంటేషన్ కు అవసరమైన మొక్కలను నర్సరీల్లో పెంచాలన్నారు. అనంతరం ఆయన బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. మొక్కలు పూర్తి స్థాయిలో…

*ప్రచురణార్థం-2* రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 3: జిల్లాలో సైనిక్ స్కూల్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కలెక్టర్ చాంబర్ లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో 100 సైనిక్ స్కూళ్ళు, ప్రయివేటు భాగస్వామ్యంతో ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలో సైనిక్ స్కూల్ స్థాపనకు అదనపు కలెక్టర్, అధికారులతో కలిసి వేములవాడ పట్టణం మల్లారం రోడ్…

*ప్రచురణార్థం-1* రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 3: అభివృద్దిలో సిరిసిల్ల నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్ది, తనను ఎన్నుకున్న సిరిసిల్ల ప్రజల రుణాన్ని తీర్చుకుంటానని రాష్ట్ర ఐటి, పురపాలన, పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రి కె. తారకరామారావు అన్నారు. గురువారం మంత్రి సిరిసిల్ల పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసారు. ఇందులో సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని 3 వ వార్డులో 15 లక్షల రూపాయలతో అందుబాటులోకి తీసుకువచ్చిన సీసీ కెమెరాలు, హైమాస్ లైట్ల ప్రారంబోత్సవం, సుమారు…

ప్రచురణార్థం-4 రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 2: అభివృద్ధి పనుల్లో వేగం పెంచి, త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన చాంబర్ లో అధికారులతో రోడ్లు, భవనాల శాఖచే చేపడుతున్న పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో రోడ్లు, భవనాల శాఖచే చేపడుతున్న రెండు పడక గదుల ఇండ్ల కాలనీల పనులు పూర్తి చేయాలన్నారు. సిరిసిల్ల బై-పాస్ రోడ్,…

ప్రచురణార్థం-3 రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 03: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం పరిసరాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్య ప్రసాద్ ఆదేశించారు. బుధవారం అదనపు కలెక్టర్ వేములవాడ మున్సిపల్ పరిధిలో నిర్మిస్తున్న వైకుంఠధామం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, డ్రైనేజీలు, ఆలయ పరిసరాల్లో పారిశుద్ధ్యం తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అనంతరం ఆలయంలోని గెస్ట్ హౌస్ లో మున్సిపల్, ఆలయ అధికారులతో…

ప్రచురణార్థం-2 రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 02: నిరుపేదల సొంతింటి కళ నెరవెరాలనే లక్ష్యంతో నిర్మించిన రెండు పడక గదుల ఇండ్లను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పరిశీలించారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో, పోత్గల్ గ్రామంలో నిర్మించిన రెండు పడక గదుల ఇండ్లను కలెక్టర్ బుధవారం సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించి పలు సూచనలు చేశారు. ముస్తాబాద్ లో 9 కోట్ల 82 లక్షల రూపాయలతో 156 ఇండ్లు, పోత్గల్ లో 2 కోట్ల 42 లక్షల రూపాయలతో…

ప్రచురణార్థం-1 రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 2: దళితులు ఆర్థికాభివృద్ధి సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. బుధవారం ముస్తాబాద్ మండలం మొర్రాపూర్ గ్రామంలోని దళితులతో సమావేశమై, దళితబంధు పథకంలో భాగంగా యూనిట్ల ఎంపికపై కలెక్టర్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పథకానికి అర్హులైన లబ్దిదారులు వారికి నిరంతరం జీవనోపాధి ఉండే రంగాలలోని యూనిట్లను, ఆర్థికంగా అభివృద్ధి పొందే యూనిట్లను ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఎక్కువ మంది లబ్దిదారులు సమూహంగా కలిసి…

ప్రచురణార్థం-4 రాజన్న సిరిసిల్ల, జనవరి 31: జిల్లాలో వ్యాక్సినేషన్ పూర్తి చేయడంపై సంబంధిత అధికారులు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో వ్యాక్సినేషన్, సీజనల్ వ్యాధులు, ఏఎన్సి చెకప్, ఇమ్యునైజేషన్ లపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో రెండవ డోస్, బూస్టర్ డోస్ కు అర్హులై కూడా ఇంకా వ్యాక్సిన్ వేసుకోని వారిని గుర్తించి…

ప్రచురణార్థం-3 రాజన్న సిరిసిల్ల, జనవరి 31: పల్లె ప్రగతి కార్యక్రమ పనుల పురోగతిపై గ్రామాల్లో క్షేత్ర స్థాయిలో అధికారులు పర్యటించి, తనిఖీలు చేపట్టాలని పంచాయితీ రాజ్ కమీషనర్ డా. ఏ. శరత్ ఆదేశించారు. సోమవారం ఆయన హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, పంచాయితీ అధికారులతో పల్లె ప్రగతి పనుల పురోగతి, తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. గ్రామ పంచాయితీల్లో కంపోస్ట్ షెడ్లు, వైకుంఠధామాల వినియోగం సక్రమంగా ఉండేలా పర్యవేక్షణ…

ప్రచురణార్థం-2 రాజన్న సిరిసిల్ల, జనవరి 31: జిల్లా లోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి వినతులు, ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో స్వీకరించారు. ప్రజల ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం చూపే దిశగా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆయన అన్నారు. ప్రజల నుండి 12 అర్జీలు వచ్చినట్లు,…