Tags: వరంగల్ రూరల్

కరోనా నియంత్రణకు వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి తెలిపారు. శనివారం ఉదయం గీసుకొండ మండలంలోని ధర్మారం, వంచనగిరి  గ్రామాలలో జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ముందుగా ధర్మారం గ్రామంలో జరుగుతున్న వ్యాక్సినేషన్ పక్రియను పరిశీలించారు. గ్రామాలలో ఇంకా వ్యాక్సినేషన్ వేసుకొని వాళ్ళు త్వరగా వ్యాక్సినేషన్ చేయించుకోవాలని, వైద్య సిబ్బంది ప్రతి ఇంటికి వస్తున్నారని కావున ప్రజలు త్వరగా వ్యాక్సినేషన్ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు, వైద్య సిబ్బంది వద్ద …

దేశంలోనే భూ పరిపాలనా రంగంలో విప్లవాత్మకమైన ధరణి కార్యక్రమాన్ని వరంగల్ జిల్లాలో సమర్థవంతంగా అమలు అవుతోందని జిల్లా కలెక్టర్ గోపి అన్నారు. శుక్రవారంతో ధరణి పోర్టల్ విజయవంతంగా ఒక సంవత్సరం తన కార్యకలాపాలను పూర్తి చేసుకున్న సందర్బంగా మండల తహసీల్దార్ లతో, ధరణి సేల్ కి సంబందించిన సెక్షన్ అధికారులతో కలెక్టర్ కాన్ఫెరెన్స్ హాల్ లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు . ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు దేశంలోనే తొలిసారిగా ధరణి…

వంద శాతం విద్యార్థులు పాఠశాలలకు హాజరవ్వాలని కలెక్టర్ గోపి అన్నారు. సోమవారం సెక్టోరల్, మండల విద్య శాఖ, నోడల్ అధికారులు, సివిల్ ఇంజనీర్ల తో కలెక్టర్ సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు . ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గాయని.. తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపాలని కలెక్టర్ అన్నారు. ఇప్పటికే కరోనా వైరస్ వల్ల విద్యార్థులు ఎంతో నష్టపోయారని తల్లిదండ్రులు గుర్తించాలన్నారు. విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని పేరెంట్స్ తమ…

వయోవృద్ధుల చట్టాలను అమలు పరచటానికి తగు చర్యలు తీసుకోనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. శుక్రవారం వరంగల్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో 31వ ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు . ఈ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవాన్ని అందరం కలిసి జరుపుకోవడం ఆనందదాయకం మని మొదట నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. తల్లిదండ్రుల అభిప్రాయాలు వారి కష్టాలను అడిగి తెలుసుకోవాలని పెద్దలు తమ కష్టాలను ఎవరికి చెప్పరని, కావున సహృదయంతో కుటుంబ సభ్యులే అడిగి…

జిల్లా ప్రభుత్వ యంత్రాంగం మరియు నెహ్రూ యువ కేంద్ర వరంగల్ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో అజాదిక అమృత్ మహోత్సవ్ కార్యక్రమం లో భాగంగా క్లీన్ ఇండియా ప్రోగ్రాం ఈ నెల అక్టోబర్ 1వ తారీకు నుండి 31 వ తారీకు వరకు దేశవ్యాప్తంగా 744 జిల్లాల్లో కొనసాగనుంది. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో ఈరోజు ఉదయము 11:30 గంటలకు జిల్లా కలెక్టర్ డాక్టర్…

గురువారం వరంగల్ జిల్లాలోని నల్లబెల్లి మరియు నర్సంపేట మండలాలలో కలెక్టర్ ఆకస్మికంగా పర్యటించారు. ముందుగా నల్లబెల్లి మండలంలోని అరిసెనపెళ్లి గ్రామంలో డ్రాగన్ ఫ్రూట్ తోట వేసిన పంటను కలెక్టర్ పరిశీలించారు. పంట కు సంబంధించి రైతు శేఖర్ ఆచారి ని వివరాలు అడిగి తెలుసుకున్న కలెక్టర్ తోటలో పండిన డ్రాగన్ ఫ్రూట్ లను చూసి పంట బాగా వచ్చిందని .. ఇందుకు ఆ రైతు తీసుకున్న శ్రమ, శ్రద్దను అభినందించారు. ఇలాగే జిల్లా లోని రైతులు ఉద్యాన…

పత్తి కొనుగోలు ప్రక్రియ లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బి.గోపి అన్నారు. 20 – 21 వ సం..ఖరీఫ్ సీజన్ కు గాను వచ్చే పత్తి పంట కొనుగోలుకై చేయాల్సిన ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మార్కెటింగ్ CCI , జిన్నింగ్ మిల్స్ యాజమాన్యాలు మరియు రైతులతో కలెక్టర్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అగ్రికల్చర్, మార్కెటింగ్ ,డి ఆర్ డి ఓ శాఖలకు…

సీఎం గిరి వికాస్ పథకానికి అర్హులైన వారు దరఖాస్తు చేసుకోనవాల్సిందిగా జిల్లా కలెక్టర్ బి.గోపి తెలిపారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ చాంబర్ నందు గిరి వికాసం పథకం మీద సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అర్హులైన గిరిజనులు సీఎం గిరి వికాస్ పథకం క్రింద బోరుబావుల మంజూరు గురించి దరఖాస్తులు చేసుకోవాలన్నారు. సంబంధిత మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం ద్వారా అట్టి ప్రతిపాదనలను పంపవలసిందిగా కలెక్టర్ సూచించారు.…

వైకుంఠ దామాల నిర్మాణపు పనులు పదిహేను రోజులలో పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం వరంగల్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పల్లె ప్రగతి పనులపైన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సెక్రటరీ మాట్లాడుతూ పల్లె ప్రగతి కార్యక్రమాలలో భాగంగా వైకుంఠ ధామాల పనులు పూర్తి స్థాయిలో వరంగల్ జిల్లాలో కాలేదని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు 15 రోజులలో పనులు పూర్తి…

మంగళవారం వరంగల్ రూరల్ జడ్పీ సమావేశ మందిరంలో జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది . ఈ సందర్బంగా జెడ్పి చైర్ పర్సన్ మాట్లాడుతూ జిల్లాలోని జెడ్పీటీసీలు,ఎంపీపీలు అధికారులందరూ సమన్వయంతో పని చేస్తేనే జిల్లా అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధి, వైద్యం, శానిటేషన్, ప్రధాన ఎజెండాగా సుదీర్ఘంగా సమావేశం జరిగింది. జిల్లా పంచాయతీ అధికారి గ్రామాలలో పర్యటించాలని…మండలాలలో జరిగే అన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు జెడ్పిటిసి ,ఎంపీపీ లను కూడా…