Tags: సిరిసిల్ల

సిరిసిల్ల, నవంబర్ 9: 2021-23 కాలానికి సంబంధించి జిల్లాలో మద్యం దుకాణాల కేటాయింపుకు అర్జీదారుల నుండి దరఖాస్తులను స్వీకరించడానికి ఈ నెల 18 వ తేదీ వరకు గడువు ఉందని, అలాగే 20 వ తేదీన జిల్లా కలెక్టర్ అధ్యక్షతన లక్కీ డ్రా నిర్వహించడం జరుగుతుందని సిరిసిల్ల ఎక్సైజ్ సీఐ ఎంపీఆర్. చంద్రశేఖర్ వెల్లడించారు. మద్యం దుకాణాల కేటాయింపుకు సంబంధించి నూతన పాలసీ విధివిధానాలపై మంగళవారం ఆయన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో విలేఖరుల సమావేశం నిర్వహించారు.…

సిరిసిల్ల, నవంబర్ 5: సిరిసిల్ల పట్టణంలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న సఖి కేంద్ర భవనం పూర్తి స్థాయిలో సిద్ధం చేసి, ప్రారంభానికి తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ సఖి కేంద్రం భవనాన్ని శిశు, సంక్షేమ శాఖ అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సఖి కేంద్రం ద్వారా మహిళల సంక్షేమం, బాధిత మహిళలకు సేవలు అందించవచ్చని తెలిపారు.…

*ఈ నెల 1 వ తేదీ 30 వ తేదీ వరకు ఓటరు నమోదు కార్యక్రమం* రాజన్న సిరిసిల్ల, నవంబర్ 1: జిల్లాలో 1 జనవరి, 2022 నాటికి 18 సంవత్సరాలు నిండే ప్రతీ ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కలెక్టర్ చాంబర్ లో ఓటరు నమోదుపై భారత ఎన్నికల కమీషన్ రూపొందించిన పోస్టర్ ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా…

రాజన్న సిరిసిల్ల, నవంబర్ 1: రైతులకు ఇబ్బందులు కలగకుండా సజావుగా ధాన్య కొనుగోలు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కలెక్టర్ చాంబర్ లో అధికారులతో ధాన్య కొనుగోలుపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్య కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఐకెపి ద్వారా 66, పిఏసీఎస్ ద్వారా 184, డీసీఎంఎస్ ద్వారా 8,…

రాజన్న సిరిసిల్ల, నవంబర్ 1: అటవీ పరిరక్షణ, పోడు భూములు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్ష లో అటవీ అధికారులతో అడవుల విస్తీర్ణం, పోడు భూములకు సంబంధించిన అంశాలపై చర్చించారు. జిల్లాలోని అటవీ సంపదను కాపాడాలని అధికారులను ఆదేశించారు. పోడు భూములకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ముందుకు సాగాలని సూచించారు. అడవులను సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై…

రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 31: దేశ ఐక్యత, సమగ్రతకు కృషి చేసిన ధీశాలి, ఉక్కుమనిషి, భారత రత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ అని, ఆయన జయంతి అక్టోబరు 31వ తేదీని “జాతీయ ఐక్యత దినోత్సవం”గా జరుపుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. ఆదివారం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత…

సిరిసిల్ల, అక్టోబర్ 30: నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్, సీజనల్ వ్యాధులు (మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, జ్వరం), వ్యాక్సినేషన్ పై సంబంధిత వైద్య శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సమీక్షించారు. శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశం మందిరంలో వైద్య శాఖ అధికారులతో సమీక్షించి పలు అంశాలపై చర్చించారు. మొదటగా ఎల్వీ ప్రసాద్ సంస్థ డైరెక్టర్, ప్రతినిధులతో మాట్లాడి జిల్లాలోని పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో గల అంగన్వాడీ కేంద్రాలలో గల…

సిరిసిల్ల, 30 అక్టోబర్, 2021 సిరిసిల్లలోని మరమగ్గాలు, చేనేత మగ్గాలను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. శనివారం కలెక్టర్ సిరిసిల్ల పట్టణం వెంకట్రావునగర్ లోని మరమగ్గాలను సంబంధిత జౌళి శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. వార్పింగ్ యూనిట్ మరియు మరమగ్గాల ద్వారా వస్త్ర ఉత్పత్తి, డైయింగ్ యూనిట్లను పరిశీలించి, విభాగాల వారిగా యజమానులతో, కార్మికులతో మాట్లాడి ప్రస్తుత స్థితి గతులను తెలుసుకున్నారు. అనంతరం సిరిసిల్ల చేనేత పారిశ్రామిక సహకార సంఘంను పరిశీలించి చేనేత…

రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 29: ధరణి, కోర్టు కేసులు, రెండు పడక గదుల ఇండ్ల దరఖాస్తులను పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో అన్ని మండలాల తహశీల్దార్లతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండల స్థాయిలో దరఖాస్తులు పెండింగ్ ఉండకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. ముఖ్యంగా ధరణి, కోర్టు కేసులు, రెండు పడక గదుల ఇండ్ల…

రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 29: రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు దేశంలోనే తొలిసారిగా భూ రికార్డ్ ల నిర్వహణకై ధరణి పోర్టల్‌ను అక్టోబర్ 29 2020న ప్రారంభించారు. నేటితో పోర్టల్ విజయవంతంగా ఒక సంవత్సరం తన కార్యకలాపాలను పూర్తి చేసుకుంది. దేశంలోనే భూ పరిపాలనా రంగంలో విప్లవాత్మకమైన ధరణి కార్యక్రమం రాజన్న సిరిసిల్ల జిల్లాలో సమర్థవంతంగా అమలు అవుతోంది. . ధరణి అనేది రెవెన్యూ పరిపాలనలో సురక్షితమైన, అవాంతరాలు లేని, ట్యాంపర్ ప్రూఫ్ గా ఉంది, వివక్ష…