Tags: KHAMMAM

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని లకారం ట్యాoక్ వద్ద జూన్ 2 నుండి జూన్ 22 వరకు 21 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడునని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఔత్సాహికులైన కళాకారులందరూ ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చని ఆయన తెలిపారు. సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వగోరే వారు +91 94408 16081, +91 98495 01517 నెంబర్లకు కాల్ చేసి ముందుగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన అన్నారు. కళాకారులకు…

స్వరాష్ట్రం సిద్ధించిన తొమ్మిదేళ్ల కాలంలోనే అభివృద్ధి సంక్షేమ రంగాల్లో యావత్ భారతదేశం గర్వించే స్థాయికి తెలంగాణ రాష్ట్రం చేరుకుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు అన్నారు. గురువారం రాష్ట్ర అవతరణ దినోత్సవ సంబరాల్లో భాగంగా లకారం ట్యాంక్ బండ్ పై తొలి రోజు వేడుకలను మంత్రి పువ్వాడ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇరుకైన, అస్థవ్యస్థంగా ఉన్న ఖమ్మం నగరాన్ని తెలంగాణ ప్రభుత్వం వచ్చాక దాదాపు 2 వేల కోట్ల…

ఖమ్మం జిల్లా నుండి ఎంపికయి రాష్ట్ర స్థాయి పోటీలలో మెడల్స్‌ సాధించిన క్రీడాకారులను తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, జిల్లా కలెక్టర్‌ వి.పి.గౌతమ్‌తో కలిసి క్రీడాకారులను అభినందించారు. సి.ఎం.కప్‌`2023 రాష్ట్ర స్థాయి అథ్లెటిక్‌, ఆర్చరీ, వెయిట్‌ లిఫ్టింగ్‌, లాన్‌ టెన్నీస్‌, ఫుట్‌బాల్‌, కబడ్డీ పోటీలలో జిల్లా స్థాయిలో నుండి ఎంపికయి రాష్ట్ర స్థాయిలో పోటీ పడి అథ్లెటిక్‌ విభాగంలో ఏ.మైథిలి 400 మీటర్ల పోటీలో గోల్డ్‌ మెడల్‌,…

తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను ప్రణాళికబద్ధ కార్యాచరణ చేపట్టి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. శుక్రవారం ఐడిఓసి లోని కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ పై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ సాధనలో ఉద్యోగులు కీలకపాత్ర పోషించారని, అదే స్ఫూర్తిని తెలంగాణ సాధన అనంతరం సాధించిన విజయాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. జూన్ 2వ తేది నుండి 22వ తేది వరకు…

జిల్లాలో భూసేకరణ చేసి ఖాళీగా ఉన్న స్థలాలను గుర్తించి అర్హులైన నిరుపేదలకు (75) గజాల నివాసయోగ్యమైన ఇండ్లస్థలాల పట్టాల పంపిణీకి చర్యలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ వి.పి.గౌతమ్‌ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గురువారం ఐడిఓసి స్పూర్తి వీడియో కాన్ఫరెన్స్‌ హాలు నుండి తహశీల్దార్లు, రెవెన్యూ డివిజనల్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అర్హులైన వారి జాబితాను రూపొందించి లబ్ధిదారులకు పంపిణీ చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. జాబితా రూపొందించే…

21 రోజుల పాటు నిర్వహించే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు కార్యాచరణ ప్రణాళికతో కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ వి.పి. గౌతమ్‌ అన్నారు. గురువారం ఐడిఓసి లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుండి మండల స్పెషల్‌ అధికారులు, మున్సిపల్‌ కమీషనర్లు, ఎంపిడివోలు, మండల వ్యవసాయ అధికారులతో జిల్లా కలెక్టర్‌ వేడుకల నిర్వహణపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 21 రోజులపాటు జరిగే వేడుకలను అన్ని శాఖల అధికారులు ప్రజాప్రతినిధుల సమన్వయంతో విజయవంతం…

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల సంబురాలు అంబరాన్ని తాకేలా నిర్వహించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ గారు అన్నారు. బుధవారం నగరపాలక సంస్థ మున్సిపల్‌ సమావేశ మందిరంలో జూన్‌ 2 నుండి 21 రోజుల పాటు నగరంలో దశాబ్ధి వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై నగర మేయర్‌ పునుకొల్లు నీరజ, జిల్లా కలెక్టర్‌ వి.పి. గౌతమ్‌ కలసి మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అవతరణ…

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను జిల్లాలో ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. మంగళవారం ఐడిఓసి లోని సమావేశ మందిరంలో అధికారులతో దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై మంత్రి సమీక్షించి, దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఖమ్మం జిల్లాకు ఘనమైన కీర్తి ఉందని, పరిపాలన అద్భుతంగా సాగుతుందని, అనేక విజయాలను సాధించామని, ఇది అధికారుల కృషితో సాధ్యమైనదని అన్నారు. ఆరోజు తెలంగాణ సాధనలో ఉద్యోగులు సకలజనుల సమ్మెతో…

ధాన్యం, మొక్కజొన్న సేకరణలో వేగం పెంచి, త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. సోమవారం ఐడిఓసి లోని కాన్ఫరెన్స్ హాల్లో అధికారులు, మిల్లర్లు, ట్రాన్స్పోర్టర్లతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రాల్లో సేకరించిన ధాన్యం ఎప్పటికప్పుడు కేటాయించిన రైస్ మిల్లులకు రవాణా అయ్యేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లా వ్యాప్తంగా 236 ధాన్య సేకరణ కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు, ఇప్పటి వరకు 198 కేంద్రాల ద్వారా 14,954…