Tags: MAHABUBABAD

ఈ నెల 25న తొర్రూరులో మెగా జాబ్ మేళా..జిల్లా కలెక్టర్ కె.శశాంక

ప్రచురణార్ధం మహబూబాబాద్, సెప్టెంబర్,24 పాలకుర్తి నియోజకవర్గం లోని తొర్రూరు మండల కేంద్రంలో ఉన్న రామ ఉపేందర్ గార్డెన్ లో ఈ నెల 25వ తేదీన “మెగా జాబ్ మేళా” నిర్వహిస్తున్నందున నిరుద్యోగ యువతీ యువకులు తప్పనిసరిగా పాల్గొనాలని జిల్లా కలెక్టర్ శశాంక కోరారు. ఈ జాబ్ మేళా లో 80 ప్రసిద్ధ కంపెనీలు పాల్గొంటున్నందున ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకునే అభ్యర్థులు ఉదయం 8 గంటల నుండి రిజిస్ట్రేషన్ ప్రక్రియకి హాజరు కావాలన్నారు. రిజిస్ట్రేషన్ కౌంటర్లలో యువత వివరాలను…

ఓటరు జాబితా కార్యకలాపాలు వేగవంతం చేయాలి…జిల్లా కలెక్టర్ కె.శశాంక

ప్రచురణార్ధం మహబూబాబాద్, సెప్టెంబర్,23. ఓటరు జాబితా కార్యకలాపాలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు. శనివారం మహబూబాబాద్ మండల తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ సందర్శించి ఓటరు జాబితా పరిశీలన కార్యక్రమ తీరును అడిగి తెలుసుకున్నారు. చేపడుతున్న జాబితా పై పలు సూచనలు సలహాలు ఇచ్చారు. ఫారం-6,7,8 ప్రగతిని వేగవంతం చేసి నివేదిక ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ అలివేలు, తహశీల్దార్ ఇమ్మనియెల్, డిటి గణేష్, నాగరాజు రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కాళోజీ అవార్డు గ్రహీత జయరాజుకు సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలి::జిల్లా కలెక్టర్ కె.శశాంక

ప్రచురణార్ధం మహబూబాబాద్, సెప్టెంబర్,23. కాళోజీ అవార్డు గ్రహీత జయరాజుకు సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు. ఈనెల 25వ తేదీన ఉదయం 11 గంటలకు నిర్వహించనున్న జయరాజ్ సన్మాన కార్యక్రమానికి మంత్రులు ఆహ్వానితులుగా పాల్గొంటారని , సాహితీ ప్రియులు అత్యధికంగా పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఏర్పాట్లను ఘనంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఉద్యాన శాఖ అధికారి సూర్యనారాయణ సహకార శాఖ అధికారి ఖుర్షీద్, పశుసంవర్ధక…

ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేపట్టాలి…జిల్లా కలెక్టర్ కె.శశాంక

ప్రచురణార్థం మహబూబాబాద్ సెప్టెంబర్ 23. ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు. శనివారం ఐడిఓసిలోని కలెక్టర్ సమావేశ మందిరంలో ఎన్నికలకు చేస్తున్న ఏర్పాట్లను సంబంధిత అధికారులతోను ఎస్పీ చంద్రమోహన్ తో కలిసి కలెక్టర్ సమీక్షించారు. పోలింగ్ కేంద్రాలలో ర్యాంపు నిర్మాణాలు చేపట్టేందుకు అంచనా వేసి ప్రతిపాదనలు అందజేయాలన్నారు. మోడల్ పోలింగ్ స్టేషన్లను పిడబ్ల్యూడి ఓటర్ల ఎక్కువగా ఉన్న పోలింగ్ స్టేషన్లను 18 సంవత్సరాల ఓటర్లు ఎక్కువగా ఉన్న యువత పోలింగ్ స్టేషన్లను గుర్తించాలన్నారు.…

ఓటర్ల జాబిత సవరణ చేర్పులను వేగవంతం చేయాలి:: జిల్లా కలెక్టర్ కె శశాంక

దంతాలపల్లి /మహబూబాబాద్ 22 సెప్టెంబర్2023. *ఓటర్ల జాబితా సవరణ చేర్పులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కె శశాంక అన్నారు* శుక్రవారం మధ్యాహ్నం దంతాలపల్లి తాసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు నూతన ఓటర్లను చేర్చుట, ఒకచోట నుండి మరోచోటికి బదిలీ , ఓటర్ల తొలగింపు ఫారం 6,7,8,కు సంబంధించిన జాబితాను ఎలక్షన్ కమిషన్ ఆదేశాలకు లోబడి జాబితాను తయారు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.మండలంలో ఇప్పటివరకు నూతన ఓటర్లు 600 పైగా…

రైతులకు ఆధార్ తోనే ఎరువులు అందజేయాలి::జిల్లా కలెక్టర్ కె. శశాంక

ప్రచురణార్థం తొర్రూరు /మహబూబాబాద్ 22 సెప్టెంబర్2023. శుక్రవారం జిల్లా కలెక్టర్ కె. శశాంక తొర్రూరు పట్టణం లోని ఎరువుల, పురుగు మందుల దుకాణలను ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. పట్టణ శివారులోని అన్నదాత ఆగ్రోస్ ఎరువుల దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి నాణ్యత ప్రమాణాలను రైతులకు అందజేస్తున్న పద్ధతులను ,రిజిస్టర్ లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బిల్లు లేకుండా రైతులకు ఎరువులు కాని పురుగు మందులు కాని అమ్మరాదని తెలిపారు. అదేవిధంగా రైతులు ఆధార్…

సబ్బండ కులాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం ::రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.

ప్రచురణార్థం కులవృత్తులకు చేయూతనందిస్తు వ్యక్తిగత వికాసానికి అహర్నిశలు ఆరాటపడుతున్న ముఖ్యమంత్రి కి మనం రుణపడి ఉండాలి…..*మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు* *బుడగ జంగాల సంక్షేమానికి పెద్ద పీట* *తొర్రూరులో త్వరలో చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు* శుక్రవారం తొర్రూరు డివిజన్ కేంద్రంలోని వెంకటాపురం రోడ్డులో రూ.2కోట్ల 30 లక్షలతో నిర్మించనున్న ఆధునిక దోభిఘాట్ ల నిర్మాణానికి శంకుస్థాపన, అన్నారం రోడ్డులో 1 ఎకరం స్థలంలో 2 కోట్ల రూపాయలతో బెడ బుడిగ జంగాల సంక్షేమ కమ్యూనిటీ భవనానికి…

రైతులకు సత్వరమే కొత్త రుణాలు మంజూరు చేయాలి::జిల్లా కలెక్టర్ కె.శశాంక

ప్రచురణార్థం మహబూబాబాద్, సెప్టెంబర్.21 గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నందు బ్యాంక్ మేనేజర్ల అందరితో కలిసి రైతు రుణమాఫీ పై జిల్లా కలెక్టర్ కె శశాంక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ DBT Failed అకౌంట్లో, డాక్యుమెంట్స్ లను LDM కు సబ్మిట్ చేయవలసిందిగా MAO లను ఆదేశించారు. రుణమాఫీ అయిన రైతులకు సత్వరమే కొత్త రుణాలు మంజూరు చేయవలసిందిగా బ్యాంకు మేనేజర్లను ఆదేశించారు. ఈ నెల ఆఖరి లోపు కొత్త రుణాల మంజూరు…

ప్రభుత్వ ఉత్తర్వులు 58 క్రమబద్దీకరణను వేగవంతంగా చేపడుతున్నాం..జిల్లా కలెక్టర్ కె.శశాంక

ప్రచురణార్ధం మహబూబాబాద్, సెప్టెంబర్,20. ప్రభుత్వ ఉత్తర్వులు 58 క్రింద క్రమబద్దీకరణ ప్రక్రియను వేగవంతం గా చేపడుతున్నామని, త్వరితగతిన పూర్తిచేస్తామని జిల్లా కలెక్టర్ శశాంక నివేదించారు. బుధవారం ఐ.డి.ఓ.సి.లోని కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలోని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రభుత్వ ప్రాధాన్యత గల 8 అంశాలైన ఫెస్టిలైజర్స్, ప్రభుత్వ ఉత్తర్వులు 58, 59 క్రింద క్రమబద్దీకరణ, గృహాలక్ష్మి, ఆసరా పెన్షన్స్ పెండెన్సీ, సోషల్ వెల్ఫేర్ ఇండ్ల స్థలాలు, గ్రామపంచాయతీ భవనాల గ్రౌండింగ్, తెలంగాణ హరితహారం, ఆయిల్ ఫామ్ లపై…

ప్రభుత్వ ఉత్తర్వులు 58 క్రింద స్థలాలను వేగవంతంగా క్రమబద్దీకరించాలి…జిల్లా కలెక్టర్ కె.శశాంక

ప్రచురణార్ధం మహబూబాబాద్, సెప్టెంబర్,20. ప్రభుత్వ స్థలాలలో నిర్మించుకున్న 125 గజాలలోపు ఇండ్ల స్థలాలను ఉచితంగా క్రమబద్దీకరణ చేపట్టేందుకు జి.ఓ.58 ఉత్తర్వులు జారిచేసినందున అధికారులు పర్యవేక్షించి తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు. బుధవారం ఐ.డి.ఓ.సి.లోని కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రభుత్వ ఉత్తర్వులు 58 క్రింద చేపడుతున్న ఉచిత క్రమబద్దీకరణ పై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లు నిర్మించుకున్న నిరుపేద కుటుంబాల వివరాలు నమోదు చేస్తూ…