ప్రచురణార్ధం మహబూబాబాద్, డిసెంబర్,6. ఉద్యోగులందరు తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ ప్రగతి సమావేశ మందిరంలో కోవిడ్ -19వ్యాక్సిన్ పై జిల్లా స్థాయి అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో కోవిడ్ మొదటి డోస్ 94శాతం పూర్తి అయ్యిందని, అలాగే 2వ డోస్ 52 శాతం చేయడం జరిగిందన్నారు. 100 శాతం పూర్తి చేసేందుకు వ్యాక్సినేషన్ ను వేగవంతం చేసినందున ఉద్యోగులందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకోవాలని, కుటుంబ సభ్యులకు వేయించాలని…
ఉద్యోగులందరు వ్యాక్సిన్ తీసుకోవాలి.
