Tags: MAHABUBABAD

ప్రచురణార్థం అధికారులు పని తీరు మార్చుకోవాలి… గార్ల, మహబూబాబాద్ సెప్టెంబర్,07. అధికారులు పనితీరు మార్చుకోవాలని జిల్లా కలెక్టర్ శశాంక హెచ్చరించారు. మంగళవారం భారీ వర్షాల ఈ నేపథ్యంలో గార్ల మండలం లోని రాంపురం వద్ద మున్నేరు నది పై ఉన్న కాజ్ వే మునగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడగా ఐటీడీఏ పీవో గౌతమ్ తో పర్యటించి సందర్శించి పరిశీలించారు. బారికేడ్స్ ఏర్పాటు చేసి భద్రత చర్యలు తీసుకోవాలన్నారు. వరద పూర్తిగా తగ్గుముఖం పట్టే వరకు ఎవరిని నదిని…

ప్రచురణార్థం ఏరియా హాస్పిటల్ ను సందర్శించిన కలెక్టర్ మహబూబాబాద్ సెప్టెంబర్ 6. పట్టణంలోని ఏరియా హాస్పిటల్ ను జిల్లా కలెక్టర్ శశాంక సోమవారం సాయంత్రం సందర్శించి నిర్మాణ పనులను పరిశీలించారు. జిల్లాకు వైద్య కళాశాల మంజూరు కావడంతో అందుకు అనుగుణంగా మూడు వందల పడకలను ఏరియా హాస్పిటల్ లో చేపడుతు న్నందున బెడ్స్ పెంచేందుకు చేపడుతున్న నిర్మాణ పనులను నాణ్యతతో చేపట్టాలని, ప్రణాళికబద్ధంగా ఉండాలని కలెక్టర్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ హాస్పటల్ లో పర్యటించి…

ప్రచురణార్థం నూతన కలెక్టరేట్ భవన సముదాయ నిర్మాణ పనులు నాణ్యతతో చేపట్టాలి… మహబూబాబాద్ సెప్టెంబర్ 6. కురవి రోడ్ లో 62 కోట్లతో 21 ఎకరాలలో నిర్మిస్తున్న నూతన కలెక్టర్ కార్యాలయ భవన సముదాయం నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ శశాంక సోమవారం సందర్శించి పరిశీలించారు. రోడ్లు భవనాల అధికారులతో కలిసి కలెక్టర్ కార్యాలయ భవన సముదాయం నిర్మాణ పనులను కలెక్టర్ పర్యవేక్షించారు. భవన నిర్మాణ పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ప్రస్తుతం…

ప్రచురణార్థం మహబూబాబాద్, సెప్టెంబర్-06: గ్రీవెన్స్ లో స్వీకరించిన ప్రతి దరఖాస్తుకు తప్పని సరిగా సమాధానం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు. సోమవారం గ్రీవెన్స్ డే పురస్కరించుకుని ప్రజల నుండి ఫిర్యాదులు విజ్ఞప్తులు స్వీకరించారు. గూడూరు మండలం గుండెంగ గ్రామానికి చెందిన దివ్యాంగుడు కందిక సాయిలు తనకు బ్యాటరీ సైకిల్ మంజూరు చేయాలని కోరారు. కేసముద్రం మండలం కోరుకొండ పల్లి పరిధిలోని భూమిని తన కొడుకులు వీరారెడ్డి సాంబరెడ్డి చెరొక 8 ఎకరాలు పంచుకున్నారని పట్టించుకోవడంలేదని అలంఖానిపేట…

ప్రచురణార్ధం గణేష్ ఉత్సవాలకు పకడ్భందీ ఏర్పాట్లు చేయాలి — జిల్లా కలెక్టర్ కె.శశాంక. మహబూబాబాద్, సెప్టెంబర్-04: వినాయక చవితి సందర్భంగా గణేష్ ఉత్సవాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కె.శశాంక అన్నారు. అన్ని ఏర్పాట్లు చేసి మొదటి రోజు నుండి నిమజ్జనం వరకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఉత్సవాలు నిర్వహించాలని తెలిపారు. శనివారం కలెక్టరేట్ ప్రగతి సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ సమావేశంలో సంబంధిత శాఖాధికారులతో ఏర్పాట్లపై సమీక్షించారు. గణేష్ ఉత్సవ కమిటీ…

ప్రచురణార్థం విద్యార్థులు నూరు శాతం హాజరు కావాలి… మహబూబాబాద్ సెప్టెంబర్ 3. విద్యార్థులు నూరు శాతం హాజరు కావాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో కలిసి మండల స్థాయి అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాలకు వచ్చే విధంగా ఉపాధ్యాయులు చొరవ చూపాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడాలని ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలన్నారు 18 సంవత్సరాలు దాటిన పిల్లలు అందరూ…

ప్రచురణార్ధం భారీ వర్షాలకు ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అధికారులు క్షేత్ర స్థాయిలో సిబ్బందిని అప్రమత్తం చేయాలి… మహబూబాబాద్, సెప్టెంబర్-02: గత రెండురోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నందున వరదలతో ఎటువంటి ఆస్తి,ప్రాణ నష్టం సంభవించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయం లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో భారీ వర్షాల వలన వచ్చే వరదలకు ప్రమాదాలు సంభవించకుండా తీసుకునే చర్యలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.…

ప్రచురణార్థం హరితహారం పర్యవేక్షణ బృందాలకు సహకరించాలి… మహబూబాబాద్ ఆగస్టు 30. 2019- 20 సంవత్సరంలో చేపట్టిన హరితహారం మొక్కల ప్రగతిని వాస్తవ నివేదిక రూపొందించాలని అదేవిధంగా తనిఖీ బృందాలకు సహకరించి వాస్తవాలను తెలియజేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో హరితహారం పై ఉన్నతాధికారులతో జూమ్ మీటింగ్ జరిగింది అనంతరం కలెక్టర్ మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హరితహారం పై తనిఖీ కార్యక్రమం సెప్టెంబర్ 15 లోపు ముగుస్తున్నందున హరితహారంలో…

ప్రచురణార్థం భారీ వర్షాలతో ప్రజలకు ఆస్తి ప్రాణ నష్టం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. మహబూబాబాద్ ఆగస్టు 30. అధిక వర్షపాతం నమోదు అవు ఉన్నందున చెరువులు తెగిపోకుండా లోతట్టు ప్రాంతాలు జలమయం కానందున ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో హైదరాబాద్ నుండి రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ఉన్నత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా…

ప్రచురణార్ధం అర్హులైన లబ్ధిదారులకు తప్పనిసరిగా న్యాయం చేకూరుస్తాం… మహబూబాబాద్ ఆగస్టు 30. అర్హులైన లబ్ధిదారులకు తప్పనిసరిగా న్యాయం చేకూరుస్తానని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. సోమవారం గ్రీవెన్స్ డే పురస్కరించుకొని కలెక్టర్ కార్యాలయానికి విచ్చేసిన పలువురి దరఖాస్తులను కలెక్టర్ స్వీకరించారు. నెల్లికుదురు మండల కేంద్రనికి చెందిన రత్నపురి ఉప్పలయ్య తాను 86% తో వికలాంగుడు నని తనకు బ్యాటరీ ట్రై సైకిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. చంద్రు తండా గ్రామం మూడో వార్డు లో…