Tags: medak

ఈ నెల 7 నుండి 19 వరకు టి డి.టీకా స్పెషల్ డ్రైవ్..అదనపు కలెక్టర్ రమేష్

ధనుర్వాతం, కంఠసర్ఫ (డిఫ్థేరియా ) వ్యాధుల నుండి పిల్లలను రక్షించుటకు ఈ నెల 7 నుండి 19 వరకు టి.డి. (టెటనస్ అండ్ డిఫ్థేరియా ) టీకా ఇవ్వనున్నామని అదనపు కలెక్టర్ రమేష్ తెలిపారు. ధనుర్వాతం రాకుండా గతంలో టెటనస్ టీకా ఇచ్చేవారమని కానీ డిఫ్థేరియా తో పిల్లలు బాధపడుచున్నారని గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ 2017 నుండి టెటనస్ స్థానములో టి.డి. వ్యాక్సిన్ ను ఇస్తున్నారని అన్నారు. కరోనా వల్ల గత రెండు సంవత్సరాల నుండి…

అఖండ భారత దేశానికి ఒక రూపాన్ని తీసుకొచ్చిన మహనీయుడుసర్దార్ వల్లభాయ్ పటేల్-జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్

ఐదు వందలకు పైగా సంస్థానానలను విలీనం చేసి అఖండ భారత దేశానికి ఒక రూపాన్ని తీసుకొచ్చిన మహనీయుడు భారత రత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ అని జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్ అన్నారు. అందరం కలిసి ఉంటే కలిగే ప్రయోజనాలను వివరిస్తూ సంస్థానాలను విలీనం చేయడంలో పటేల్ కీలక పాత్ర వహించారని, ఆయన జన్మదినమైన అక్టోబర్ 31 ను జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరుపుకుంటున్నామని అన్నారు. సోమవారం కలెక్టరేట్ లోని ప్రజావాణి హాల్ లో జాతీయ…

ప్రజా వినతులకు ప్రాధాన్యతనిచ్చి సత్వరమే పరిష్కరించవలసినదిగా జిల్లా పంచాయతీ అధికారి- తరుణ్ కుమార్

ప్రజా వినతులకు ప్రాధాన్యతనిచ్చి సత్వరమే పరిష్కరించవలసినదిగా జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్ అధికారులకు సూచించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో డి.ఎస్.ఓ. శ్రీనివాస్ తో కలిసి జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రధానంగా భూమి పట్టా మార్పిడి, భూమి సర్వే , ధరణిలో మార్పులు, భూ సమస్యలు., పోడు భూముల సమస్యలతో పాటు పింఛన్లు మంజూరు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల మంజూరు, అంగన్వాడీ టీచర్ పోస్టు కావాలని 63 దరఖాస్తులు…

రైతు బాగుంటేనే ప్రభుత్వం బాగుంటుంది..ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి

నలుగురికి అన్నం పెట్టె రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నమ్మి రైతు సంక్షేమానికి పెద్ద పీట వేసి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని మెదక్ శాసనసభ్యురాలు పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం హవేళీ ఘనపూర్ మండలం బూరుగుపల్లి లో పి.ఏ.సి.ఎస్. ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో వ్యవసాయం దండుగ అనే వారని, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు, రైతు…

ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజావాణి – అదనపు కలెక్టర్ రమేష్

ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజావాణి కార్యక్రమం చేపట్టబడిందని, అధికారులు ఇట్టి ప్రాధాన్యతను గుర్తించి తక్షణమే సమస్యల పరిష్కారానికి కృషిచేయాలని అదనపు కలెక్టర్ రమేష్ సూచించారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి 32 వినతులు వచ్చాయి. అందులో ప్రధానంగా భూ సమస్యలకు సంబంధించి 20 విజ్ఞప్తులు రాగా, సదరం సర్టిఫికెట్, మూడు చక్రాల బ్యాటరీ సైకిల్, కృత్రిమ కాలు కావాలని, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని తదితర 12 విజ్ఞప్తులు…

ఇంటర్మీడియట్ పరీక్షలు సజావుగా నిర్వహించాలి  – జిల్లా కలెక్టర్ ఎస్. హరీష్

ఎటువంటి చిన్న పొరపాటుకు తావివ్వకుండా ఇంటర్మీడియట్ పరీక్షలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ ఎస్. హరీష్ అన్నారు. ఈ నెల 6 నుండి 21 వరకు జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరవుతున్న 13,777 మంది విద్యార్థుల కోసం 31 కేంద్రాలు ఏర్పాటు చేశామని అన్నారు. ఉదయం 9 నుండి మధ్యాన్నం 12 గంటల వరకు జరిగే పరీక్షలకు విద్యార్థులు ఉదయం 8 .15 గంటల వరకు పరీక్షా కేంద్రాలకు…

భూగర్భ జలాల పెంపునకు కృషి చేయండి-స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్

భూగర్భ జలాల పెంపుదలకు వ్యూహాత్మక ప్రణాళిక తో శాస్త్రీయ పద్దతిలో ముందుకెళ్తే మంచి ఫలితాలు సాధించవచ్చని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో హైదరాబాద్ దక్షిణ ప్రాంతానికి చెందిన కేంద్ర జల శక్తి విభాగపు సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు వారు మెదక్ జిల్లాకు సంబంధించి రూపొందించిన అక్విఫర్ మ్యాప్ లు (జలాశయ పటాలు) మరియు నిర్వహణ ప్రణాళికలను సైటిస్టులు మహాదేవ్, విట్టల్ లు…

డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి

ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించుటకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లా కేంద్రంలో ఉన్న వైద్య విధాన పరిషద్ ఆసుపత్రులు పటిష్ఠపరచడంతో పాటు రాబోయే కాలంలో పేద ప్రజలకు మరింత మెరుగైన, నాణ్యమైన వైద్యం అందించుటకు మెడికల్ కళాశాలతో పాటు నర్సింగ్ కళాశాలలను ఏర్పాటు చేస్తున్నాడని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. ఈ వైద్య కళాశాలు ప్రారంభమైతే ఇకనుండి ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులకు వచ్చే వ్యయ ప్రయాసలు ఉండవని అన్నారు. జిల్లా ఆసుపత్రిలో ప్రస్తుతం…

దళితబందు యూనిట్లు త్వరితగతిన గ్రౌండింగ్ అయ్యేలాఅధికారులు ప్రత్యేక చొరవ చూపాలి -స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్

దళితబందు యూనిట్లు త్వరితగతిన గ్రౌండింగ్ అయ్యేలా అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లోని ప్రజావాణి హాల్ లో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి విజయలక్ష్మి తో కలిసి దళిగత బందు యూనిట్ల గ్రౌండింగ్ ప్రగతిని సమీక్షిస్తూ మెదక్ నియోజక వర్గంలోని చందంపేట లో, అందోల్ నియోజక వర్గం లోని టేక్మాల్ లో యూనిట్లు గ్రౌండింగ్ కాగా నరసాపూర్ లో ఇంతవరకు ప్రారంభించకపోవడం పట్ల…

కొనుగోలు కేంద్రాలను సజావుగా నిర్వహించేలా చూడాలి – ఆర్థిక ,వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మంత్రి హరీష్ రావు

రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని 3 వేల కోట్ల నష్టాన్ని భరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తున్నదని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖా మంత్రి హరీష్ రావు అన్నారు. అందరు అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా, సజావుగా నిర్వహించాలని సూచించారు. గురువారం కలెక్టరేట్ లోని ఆడిటోరియం లో జిల్లాలో ధాన్యం కొనుగోలుపై ప్రజాప్రతినిధులు, అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మొండి…