Tags: Medaram Jathara – Mulugu District

సమ్మక్క సారలమ్మ లను దర్శించుకున్న వరంగల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ నందికొండ నర్సింగరావు

ప్రచురుణార్ధం మేడారం , 17.02.2022 శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా వరంగల్ డిస్ట్రిక్ట్ జడ్జి నందికొండ నర్సింగరావు కుటుంబసభ్యులతో కలిసి నేడు సమ్మక్క సారాలమ్మలను దర్శించుకున్నారు. అమ్మవారికి బెల్లం సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా ఆయన సమ్మకను దర్శించుకొని అక్కడ నుండి సారాలమ్మ గద్దెకు చేరుకొని మొక్కులు అప్పజెప్పారు. అమ్మవార్లను దర్శించుకోవడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. —————- మేడారం, మీడియా సెంటర్ చే జారీ చేయునైనది

తేదిః 17-02-2022 ఆదివాసీల ఆరాధ్య దైవం సమ్మక్క అగమనం, కోట్లాది మంది భక్తుల ఇలవేలుపు సమ్మక్క తల్లి గురువారం రాత్రి 09:20 ని.లకు గద్దెపైన కొలువుతీరింది. ప్రభుత్వ లాంచనాలతో సమ్మక్కను మేడారం గద్దెపైకి పూజారులు, అధికారులు తీసుకువచ్చారు. అంతకుముందు ఈ మేరకు గిరిజన పూజారులు, అధికారులు విసృత ఏర్పాట్లు చేశారు. జిల్లా ఎస్సి సంగ్రామ్ సింగ్జీ పాటిల్ గాలిలోకి కాల్పులు జరిపి సమ్మక్కను ఆహ్వానించగా, జిల్లా కలెక్టర్ క్రిష్ణా అధిత్యా దగ్గరుండి చిలకలగుట్ట నుండి సమ్మక్క గద్దె…

వరంగల్  నుండి మేడారం  వరకు సాఫీగా కోనసాగతున్న ట్రాఫిక్

ప్రచురణార్థం 17.02.2022 ( శుక్రవారం) *వరంగల్ నుండి మేడారం వరకు సాఫీగా కోనసాగతున్న ట్రాఫిక్* *సత్ఫలితాలను అందిస్తున్న వరంగల్ పోలీస్ కమిషనర్ ముందుస్తు ప్రణాళికలు* *క్షేత్ర స్థాయిలో ట్రాఫిక్ ను పర్యవేక్షిస్తున్న పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి.* మేడారం జాతరను పురస్కరించుకోని ట్రాఫిక్ సెక్టార్ ఇంచార్జ్ గా వ్యవహరిస్తున్న వరంగల్ పోలీస్ కమిషనర్ ముందుస్తుగా తీసుకున్న ప్రణాళికలు సత్ఫలితాలనిస్తున్నాయి. ముఖ్యంగా పోలీస్ కమిషనర్ అధికారులతో సిబ్బందితో కల్సి క్షేత్ర స్థాయిలో ట్రాఫిక్ నియంత్రణను పర్యవేక్షణ చేస్తున్నారు. పోలీస్…

మేడారం ములుగు జిల్లా ఫిబ్రవరి 17 మేడారం గ్రామంలో జరుగుతున్న శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర లోని పలు వీధులను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గురువారం నాడు ఆకస్మికంగా తనిఖీ చేసి జాతరలో పారిశుద్ధ్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రోడ్లపై చెత్త వేయడానికి గమనించి సంబంధిత దుకాణదారులకు జరిమానా విధించారు. వీధులపై చెత్త చెదారం వేయరదని, పారిశుధ్యాన్ని పాటించాలని ఆయన కోరారు. జాతరకు దాదాపు ఒక…

భారీ బందోబస్తుతో శ్రీ సమ్మక్క అమ్మవారినీ ప్రభుత్వ లాంఛనాలతో తీస్కుకొస్తున్న దృశ్యాలు

ఉద్వేగం, ఉద్విగ్నం.. భక్తి పారవశ్యం మధ్య సమ్మక్క తల్లి ఆగమనం

Media Release Date-17-02-2022 *ఉద్వేగం, ఉద్విగ్నం.. భక్తి పారవశ్యం మధ్య సమ్మక్క తల్లి ఆగమనం* *సమ్మక్క తల్లి ఆగమనం తో మొదలైన మేడారం మహా జాతర* *తండోపతండాలుగా తరలి వస్తున్న భక్త జన సందోహం* *ప్రభుత్వ లాంఛనాలు, ఆదివాసీల సంప్రదాయ పద్ధతుల్లో స్వాగతం పలికిన మంత్రులు* మేడారం, ఫిబ్రవరి 17: మేడారం మహా జాతరలో మహా ఘట్టం మొదలైంది. నిన్న సారలమ్మ తల్లి గద్దె లను వేంచేయగా, ఈ రోజు చిలుకలగుట్ట నుండి సమ్మక్క తల్లి గద్దె…

ఇప్ప‌టికే 75ల‌క్ష‌ల మంది భ‌క్తులు ద‌ర్శనం చేసుకున్నారు.. శుక్ర‌వారం కేసీఆర్ జాత‌ర‌కు వ‌స్తారు హెలికాఫ్ట‌ర్ ద్వారా ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన మంత్రి ద‌యాక‌ర్ రావు

ఇప్ప‌టికే 75ల‌క్ష‌ల మంది భ‌క్తులు ద‌ర్శనం చేసుకున్నారు.. శుక్ర‌వారం కేసీఆర్ జాత‌ర‌కు వ‌స్తారు హెలికాఫ్ట‌ర్ ద్వారా ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన మంత్రి ద‌యాక‌ర్ రావు మేడారం, ఫిబ్ర‌వ‌రి 17 : ప్ర‌తి రెండు సంవ‌త్స‌రాల‌కు ఒక సారి జ‌రిగే మేడారం జాతరలో గద్దెపై సారల‌మ్మ ప్రతిష్ఠించకముందే దాదాపు 75 లక్షల మంది భక్తులు మేడారం ఆలయాన్ని దర్శించుకున్నారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు గురువారం మేడారంలో తెలిపారు. డిసెంబ‌ర్ నుంచి జాత‌ర ప్రారంభానికి ముందు వ‌ర‌కు…

ఎంతమంది దాటితే అంత పుణ్యం…

ప్రచురణార్థం ఎంతమంది దాటితే అంత పుణ్యం… మేడారం ఫిబ్రవరి 17. అమ్మను స్వాగతించడానికి వేస్తున్న ముగ్గులు ఈ రంగవల్లికలని , ఈ ముగ్గులను ఎంతమంది దాటితే మాకంత పున్నెం అని ఖమ్మం జిల్లా దానవాయిగూడెం కు చెందిన డి సరోజినీ యశోద రాములక్క తెలిపారు. మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరను పురస్కరించుకొని చిలకలగుట్ట రహదారిలో సమ్మక్క రాక సందర్భంగా పలువురు భక్తులు తమ మదిలో ఉన్న బలమైన కోరికలను అమ్మవార్లకు విన్నవించుకునేందుకు ముగ్గులతో జంతువులను బలి…