Tags: Rangareddy

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పండుగ వాతావరణంలో నిర్వహించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. మంగళవారం సచివాలయం నుండి ఉన్నతాధికారులతో కలిసి అదనపు కలెక్టర్లు జిల్లా, మండల, గ్రామస్థాయి ప్రజా ప్రతినిధులకు తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జూన్ 2వ తేదీ నుండి 22వ తేదీ వరకు నిర్వహించే కార్యక్రమాలలో ప్రజలు పెద్ద మొత్తంలో భాగస్వామ్యం అయ్యే…

మంగళవారం రంగారెడ్డి జిల్లా సందర్శనకు వచ్చిన జలశక్తి అభియాన్ కేంద్ర నోడల్ బృంద సభ్యులు అంకిత్ మిశ్రా, డిప్యూటీ సెక్రటరీ, అంకిత్ విశ్వకర్మ, సైంటిస్ట్ గార్లకు జిల్లా యంత్రాంగం తరపున అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ జిల్లాకు ఆహ్వానించారు. గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ పాల్గొన్నారు. జలశక్తి అభియాన్ ద్వారా రంగారెడ్డి జిల్లాలో చేపట్టిన పనులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా…

ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన మీదట అనతి కాలంలోనే తెలంగాణ సాధించిన ప్రగతి ప్రతిబింబించేలా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను అట్టహాసంగా నిర్వహించాలని రాష్ట్ర విద్య శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాష్ట్ర విద్యశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దశాబ్ది ఉత్సవ ఏర్పాట్లపై అధికారులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమావేశమై వారికి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేస్తూ,…

తెలంగాణ ప్రాశస్త్యం చాటిచెప్పేలా రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం జూన్ 02 నుండి అట్టహాసంగా నిర్వహించతలపెట్టిన తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని సోమవారం రాష్ట్ర సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, అన్ని శాఖల అధికారులతో చీఫ్ సెక్రెటరీ సమీక్ష జరిపారు. దశాబ్ది ఉత్సవాల నిర్వహణ కోసం చేపడుతున్న ఏర్పాట్లు, సన్నద్ధత గురించి జిల్లాల వారీగా పాలనాధికారులను అడిగి…

రైస్ మిల్లర్లతో సమావేశమైన కలెక్టర్ రైతాంగ ప్రయోజనాల దృష్ట్యా కొనుగోలు కేంద్రాల ద్వారా పంపించే ధాన్యాన్ని వెంటనే అన్ లోడింగ్ చేసుకోవాలని కలెక్టర్ హరీష్ రైస్ మిల్లర్లకు సూచించారు. శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సివిల్ సప్లయ్ ఛైర్మన్ రవీంద్ర సింగ్,అదనపు కలెక్టర్ తిరుపతి రావుతో కలిసి కలెక్టర్ హరీష్ రైస్ మిల్లర్ల సంఘం ప్రతినిధులు , రైస్ మిల్లర్లతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రైస్ మిల్లర్లు తమ డిమాండ్లను…

తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ధి ఉత్సవాలను జిల్లా వ్యాప్తంగా అంగరంగ వైభవోపేతంగా నిర్వహించేలా చక్కటి కార్యాచరణతో సన్నద్ధం కావలసినదిగా జిల్లా కలెక్టర్ హరీష్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి వచ్చే జూన్ నాటికి తొమ్మిదేండ్లు పూర్తి చేసుకుని 10 వ వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 21 రోజుల పాటు పండుగ వాతావరణంలో రోజు ఒక కార్యక్రమం చొప్పున జూన్ 2 నుండి 22 వరకు వివిధ శాఖల ద్వారా పలు…

హైదరాబాద్ లోని సచివాలయంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గురువారం నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో పాల్గొన్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎస్. హరీష్.  

ధాన్యం కొనుగోళ్లు దాదాపుగా చివరి దశకు చేరుకున్న ప్రస్తుత తరుణంలోనూ క్షేత్ర స్థాయిలో ధాన్యం సేకరణ ప్రక్రియను పర్యవేక్షించాలని రాష్ట్ర పౌర సరఫరాలు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ జిల్లా యంత్రాంగాలకు సూచించారు. బుధవారం ఆయన సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్, మేనేజింగ్ డైరెక్టర్ వి.అనిల్ కుమార్ లతో కలిసి జిల్లా కలెక్టర్లతో ధాన్యం కొనుగోళ్లు, కస్టమ్ మిల్లింగ్ రైస్ తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు.…

సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో తమ సమస్యలను తెలపడానికి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి అదనపు కలెక్టర్ తిరుపతి రావు 65 ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన వినతులను ఆయా శాఖాధికారులకు అందజేస్తూ తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందనే ఎంతో నమ్మకంతో ప్రజలు వ్యయప్రయాసాలతో ప్రజావాణికి వస్తారని, వారి సమస్యలను సావధానంగా విని పరిష్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

సోమవారం రంగారెడ్డి జిల్లాలోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఈ నెల 22వ తేది నుండి 24 వ తేదీ వరకు 3 రోజుల పాటు నిర్వహించు జిల్లా స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలను జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్, ఎల్.బి.నగర్ శాసన సభ్యులు సుధీర్ రెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడలను లాంఛనంగా ప్రారంభించారు. మండల స్థాయిలో ఉత్తమ ప్రతిభ పొందిన (1236) ఉత్తమ క్రీడాకారులను జిల్లా స్థాయి లో ఈనెల 22 నుండి…