రంగారెడ్డి జిల్లా సెప్టెంబర్ 09: పిల్లల పెరుగుదలకు పోషక ఆహారాలను అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ సంబంధిత అధికారులకు సూచించారు. గురువారం జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో పోషణ మాసం సెప్టెంబర్ 1 నుండి 30 వరకు సందర్భంగా కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సెప్టెంబర్ 1 నుండి 30 వరకు నిర్వహిస్తున్న పోషణ మాసంలో రక్తహీనత,…
Tags: Rangareddy
గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలి- అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్
. గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లోని సమావేశమందిరంలో భాగ్యనగర ఉత్సవ కమిటీ సభ్యులు , సంబంధిత అధికారులతో గణేష్ ఉత్సవాల నిర్వహణపై అదనపు కలెక్టరులు ప్రతీక్జైన్,తిరుపతి రావు లు సమావేశం నిర్వహించారు . ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణం నిర్వహించడానికి పకడ్బందీ చర్యలను చేపట్టాలన్నారు. గణేష్…
వ్యవసాయ అనుబంధ రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత-విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
వ్యవసాయ అనుబంధ రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గము గండి పేట్ మండలం, బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పీరంచెరువు గ్రామంలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తీగల అనిత హరి నాథ్ రెడ్డి ,స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ లతో కలిసి పెద్ద చెరువులో 50 వేల ఉచిత చేప పిల్లలను వదిలారు.…
అర్హులైన లబ్ది దారులకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు అందజేయాలి- రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
అర్హులైన లబ్ది దారులకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు అందజేయాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లోని కోర్ట్ హాలులో జిల్లాలోని డబల్ బెడ్ రూమ్ గృహ నిర్మాణ శాఖ పనితీరుపై జిల్లా శాసనసభ్యులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పనులను త్వరగా పూర్తి చేసి లబ్దిదారులకు అందించేలా చర్యలు తీసుకోవాలని…
చిన్న సన్నకారు రైతాంగానికి, పాడి పరిశ్రమకు ప్రభుత్వం పెద్ద పీట- రాష్ట్ర పాడి పరిశ్రమ సినిమా ఫోటోగ్రఫీ శాఖ మాత్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్
చిన్న సన్నకారు రైతాంగానికి, పాడి పరిశ్రమకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని రాష్ట్ర పాడి పరిశ్రమ సినిమా ఫోటోగ్రఫీ శాఖ మాత్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజక వర్గం పరిధిలోని రావిర్యాల గ్రామ పరిధిలో 32 ఎకరాల విస్తీర్ణంలో 246 కోట్ల వ్యయంతో తెలంగాణ విజయ డైరీ ఆధ్వర్యంలో అత్యాధునిక మెగా డైరీ ప్రాజెక్ట్ ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తో…
పల్లె ప్రగతి , పట్టణ ప్రగతి ద్వారా గ్రామాలు , పట్టణాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయి- రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్
పల్లె ప్రగతి , పట్టణ ప్రగతి ద్వారా గ్రామాలు , పట్టణాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ అన్నారు. తెలంగాణ ఏర్పాటు ఫలితాలు ప్రజలకు అందుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజాప్రతినిధుల సహకారంతో 19,472 గ్రామాలలో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ స్పూర్తితో మండలానికి 4 చొప్పున ఇప్పటి వరకు 547 మండలాలలో బృహత్ పల్లె ప్రకృతి వనంలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఏ…
రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నందున రెవిన్యూ, పోలీస్, ఇరిగేషన్ అధికారులు ముందస్తు ఏర్పాట్లతో అప్రమత్తంగా ఉండాలి-రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్
రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నందున రెవిన్యూ, పోలీస్, ఇరిగేషన్ అధికారులు ముందస్తు ఏర్పాట్లతో అప్రమత్తంగా ఉండాలని, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, జరుగకుండా ఎప్పటికప్పుడు పరిస్థితులను పరిశీలించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, జిల్లా పోలీసు సూపరింటెండెంట్లను ఆదేశించారు. గత రెండు రోజుల నుండి కురుస్తున్న వర్షాల కారణంగా తీసుకోవాల్సిన చర్యలపై సోమవారం రాష్ట్ర డిజిపి శ్రీ మహేందర్ రెడ్డితో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల వారీగా సమీక్ష…
జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యములో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు-కలెక్టర్ అమోయ్ కుమార్
జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యములో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు . వర్షాల వల్ల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా, ఏమైనా సమస్యలు తలెత్తినట్లయితే జిల్లా ప్రజలు కంట్రోల్ రూమ్ నెంబర్ 040-23230813, 040-23230817 లకు ఫోన్ చేయాలని సూచించారు.
2019, 2020 వ సంవత్సరాలలో హరితహారంలో భాగంగా నాటిన మొక్కల గణనను పకడ్బందీగా నిర్వహించాలి- రాష్ట్ర అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి శాంతకుమారి.
2019, 2020 వ సంవత్సరాలలో హరితహారంలో భాగంగా నాటిన మొక్కల గణనను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి శాంతకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి శాంతకుమారి జిల్లా కలెక్టర్లు, అటవీశాఖ, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో మొక్కల గణనపై జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో 2019, 2020 సంవత్సరాలకు సంబంధించిన హరితహారం…
అబ్దుల్లా పూర్ మెట్ మండలంలోని కవాడి పల్లి గ్రామపంచాయతీ కార్యాలయమును రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేసి రిజిస్టర్లను పరిశీలించారు.
గురువారం అబ్దుల్లా పూర్ మెట్ మండలంలోని కవాడి పల్లి గ్రామపంచాయతీ కార్యాలయమును రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేసి రిజిస్టర్లను పరిశీలించారు. గ్రామంలోని నర్సరీని సందర్శించి నర్సిరీలలో పెంచుతున్న మొక్కల వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు మొక్కలను నాటాలని , నాటిన మొక్కలను సంరక్షించాలని సంబంధిత గ్రామ పంచాయతీ అధికారులకు సూచించారు. అబ్దుల్లాపూర్ మెట్ గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించి చేపట్టిన పారిశుధ్య పనులను పరిశీలించి, సెప్టెంబర్ 1…