Telangana Government State Innovation Center.

సోషల్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌ ఏర్పాటుకు కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీతో ఒప్పందం కుదుర్చుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఇన్నోవేషన్ సెంటర్.

సామాజిక ఆవిష్కరణ వ్యాపార నమూనాల గురించి సమాచారయుక్తమైన నిర్ణయాలు తీసుకునేందుకు కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీని పరిశోధనా భాగస్వామిగా నియమించుకుంది.

విద్యార్థి సముదాయానికి మరింత చేరువగా ఉంటూ పరస్పరం ప్రయోజనకరమైన అవకాశాలను అన్వేషించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.

హైదరాబాద్, 11 మే 2021: హైదరాబాద్‌లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో భాగమైన కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ (KSPP), తెలంగాణ రాష్ట్ర  ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖల నిర్వహణలోని  తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (TSIC)తో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తెలంగాణ ప్రభుత్వ చీఫ్ ఇన్నోవేషన్ అధికారి రవి నారాయణ్, గీతం రిజిస్ట్రార్ ప్రొ.డి.గుణశేఖరన్, సంస్థ వ్యవస్థాపక డైరెక్టర్ శ్రీధర్ పబ్బిశెట్టి సంతకం చేసిన అవగాహన ఒప్పందం మేరకు విస్తృతమైన, ప్రపంచ స్థాయి ‘‘సోషల్ ఇన్నోవేషన్’’ (SI) పర్యావరణ వ్యవస్థను రాష్ట్రంలో నెలకొల్పే లక్ష్యంతో ఇరు వర్గాలు అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకుంటారు. కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ ఒక శక్తివంతమైన ఎకో సిస్టమ్‌ను నిర్మించడంలో సహాయపడేందుకు TSICకి ‘రీసెర్చ్ పార్టనర్’గా ఉంటుంది మరియు సోషల్ ఇన్నోవేషన్‌లను రాష్ట్రంలో అభివృద్ధి పరచేందుకు అనుకూలమైన పరిపాలన మరియు నియంత్రణ వాతావరణాన్ని కల్పించేందుకు రుజువుల ఆధారిత సిఫార్సులు చేస్తుంది.

ఈ ఒప్పందం మేరకు సామాజిక ఆవిష్కరణల (SI) వ్యాపార నమూనాలు మరియు నిర్ణయాలను తీసుకునే అంశాల్లో అవగాహనను సరళీకృతం చేసుకుంటూ, సామాజిక ఆవిష్కరణలకు సంబంధించిన పరిశోధనా రంగాలపై దృష్టి సారిస్తారు. సామాజిక ఆవిష్కరణల రూపకల్పన, ఆచరణ మరియు విస్తరణకు సహాయపడేందుకు రుజువులతో కూడిన ఆధారాలను రూపొందించేందుకు ఆన్-గ్రౌండ్ ప్లాన్స్ (పైలట్) ప్రాజెక్టుల ద్వారా అనుసంధానమై ఉండేందుకు ఏడాది వార్షిక మరియు ద్వి-వార్షిక పని ప్రణాళికలతో వారు పరస్పర ప్రయోజనకరమైన అవకాశాలను గుర్తించి అన్వేషిస్తారు.

పరిశోధన అవకాశాలు మరియు క్యాప్‌స్టోన్ ప్రాజెక్టుల ద్వారా కౌటిల్య విద్యార్థులు మరియు టిఎస్ఐసి మరియు దాని భాగస్వామ్య సంస్థలతో కలిసి పని చేసేందుకు అవకాశం ఉంటుంది. సామాజిక ఆవిష్కరణలకు సమర్థవంతమైన వాతావరణాన్ని నెలకొల్పే ప్రభుత్వ వ్యవస్థ మరియు పరిపాలనా సంస్కరణలను గుర్తించేందుకు కౌటిల్య వేర్వేరు భాగస్వాములతో కలిసి వివిధ వాటాదారులతో కలిసి పని చేస్తుంది.

‘‘కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీతో దీర్ఘకాలిక భాగస్వామ్యం కలిగి ఉన్నందుకు మేము సంతోషిస్తున్నాము. విధానపరమైన భారీ అంశాలను సరైన దిశలో ప్రభావితం చేసేందుకు మేము సంయుక్తంగా రూపొందించే సామాజిక ఆవిష్కరణల పైలట్ల పాఠాలను ఇప్పుడు వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే పలు సామాజిక ఆవిష్కరణల్లో ముందంజలో ఉన్న తెలంగాణ ఈ భాగస్వామ్యం ద్వారా నేర్చుకునేందుకు మద్ధతు ఇస్తున్న ఒక సామాజిక ఆవిష్కరణల ఎకోసిస్టమ్‌ను రూపొందించుకునేందుకు అవకాశం ఉంటుందని’’ తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమలు మరియు ఐటి & సి ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ అన్నారు.

కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ వ్యవస్థాపక డైరెక్టర్ శ్రీధర్ పబ్బిశెట్టి మాట్లాడుతూ “విద్యార్థుల అభ్యాస డైనమిక్స్ స్థిరమైన వేగంతో అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, విద్యార్థుల చేతుల మీదుగా అనుభవాన్ని అందించడం అనేది ఆచరణాత్మక ఆలోచన మరియు విశ్లేషణాత్మక జ్ఞానాన్ని ప్రోత్సహిస్తుంది. సాంప్రదాయిక అభ్యాసం నుంచి మొదటి అనుభవానికి మార్పు తీసుకు వచ్చే నిపుణులు ఉన్న సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకున్నందుకు మేము సంతోషిస్తున్నామని’’ హర్షాన్ని వ్యక్తం చేశారు.

‘‘కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీతో భాగస్వామ్యం మాకు సంతోషంగా ఉంది మరియు వారిని మా పరిశోధన భాగస్వామిగా చేర్చుకున్నాము. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యంతో, రాష్ట్రంలో స్థిరమైన మరియు అర్ధవంతమైన సామాజిక ఆవిష్కరణతో కూడిన ఎకోసిస్టమ్‌ను సృష్టించే వివిధ అంశాలపై కలిసి పని చేయాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. రాష్ట్ర అభివృద్ధికి పెద్ద ఎత్తున సంస్థలతో ఇన్నోవేషన్, కాగ్నిటివ్ థింకింగ్‌ను అమలు చేసేందుకు మేము సంయుక్తంగా కృషి చేస్తున్నామని’’ టిఎస్‌ఐసి చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ రవి నారాయణ్ అన్నారు.

‘‘ఈ భాగస్వామ్యం ద్వారా తెలంగాణలో సోషల్ ఇన్నోవేషన్ కోసం విధానపరమైన విధానాలను రూపకల్పనను బలోపేతం చేసేందుకు శ్రమిస్తున్న సంస్థల ఎకోసిస్టమ్‌ను మరింత మెరుగుపరుస్తుంది  మరియు ఆధునిక, సమకాలీన ఆలోచన మరియు ప్రజలను కేంద్రీకృతం చేసే విధానాలను రూపొందించేందుకు మార్గాన్ని సుగమం చేస్తుందని’’ తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ సీనియర్ సలహాదారు వివేక్ వర్మ అన్నారు.

కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీలో వివిధ ఆచరణాత్మక అంశాలు మరియు విధానాలు, నిర్ణయాధికారానికి సంబంధించిన అంశాలపై టిఎస్ఐసి గెస్ట్ లెక్చర్లను నిర్వహించేందుకు ఈ అవగాహన ఒప్పందం ప్రోత్సహిస్తుంది. బహుపాక్షిక సంస్థలు మరియు కార్పొరేట్ భాగస్వాములు స్పాన్సర్ చేసే స్థలాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని కూడా వారు పరిశీలిస్తారు.

About Telangana State Innovation Cell: (https://www.teamtsic.org/about-us/)

Telangana State Innovation Cell (herein referred to as TSIC) is an initiative by the Information Technology, Electronics & Communications Department, Government of Telangana, headed by Mr. Ravi Narayan, Chief Innovation Officer, Government of Telangana. Telangana State Innovation Cell (TSIC) was set up in 2017 under the State Innovation policy to foster an innovation-driven economy in Telangana. Today, it acts as the first response of the State Government for identified innovators, start-ups/entrepreneurs, and innovation catalysts to create an inclusive innovation ecosystem. TSIC is driven by three mandates: To build a culture of innovation among the student community, to promote the culture of innovation in the State, and to foster innovation in the government and administration.

About Kautilya School of Public Policy: (https://kautilya.org.in/)

Founded in 2020, Kautilya School of Public Policy is a State-of-the-art Public Policy School in Hyderabad. Kautilya aspires to combine the Indian ethos, culture, and values with the western frameworks in public policy. With the vision of “Rebalance the role of Society, Government, and Business towards an Equitable and Regenerative India and World” the school is along the lines of ivy league policy schools in the US.

Share This Post