Telangana ku Haritha Haram

ఏడవ విడత- తెలంగాణకు హరితహారం

  • ఏడవ విడత తెలంగాణకు హరితహారంలో మొక్కలు నాటే లక్ష్యం – 20 కోట్లు (19.91 కోట్లు)
  • 2015 లో ప్రారంభమైంది, 230 కోట్ల మొక్కలను నాటడం లక్ష్యంగా నిర్దేశించటమైనది.
  • రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం నర్సరీల సంఖ్య  – 15,241 .
  • అందుబాటులో ఉన్న మొక్కల సంఖ్య సుమారు 25 కోట్లు.
  • ఈసారి బహళ రహదారి వనాలకు (మళ్టీ లెవల్ అవెన్యూ ప్లాంటేషన్) ప్రాధాన్యత.
  • జాతీయ, రాష్ట్ర రహదారులతో పాటు పంచాయితీ రోడ్ల వెంట బహుళ వనాలు నాటే కార్యక్రమం.
  • వీలున్న ప్రతీ చోటా యాదాద్రి (మియావాకీ) మోడల్ లో చెట్లు నాటేందుకు ప్రాధాన్యత.
  • ఇంటింటికి ఆరు మొక్కల చొప్పున పంపిణీ, పెంచే బాధ్యత ఆయా కుటుంబాలకు.
  • అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఖాళీ స్థలాలను గుర్తించి మొక్కలు నాటాలనే నిర్ణయం.
  • జులై 1 నుంచి 10 దాకా పల్లె, పట్టణ ప్రగతి, హరితహారంపై రాష్ట్ర మంతటా స్పెషల్ డ్రైవ్.
  • ప్రతీ ప్రాంతంలో అటవీ భూముల గుర్తింపు, అటవీ పునరుద్దరణకు చర్యలు.
  • అటవీ బ్లాకుల వారీగా జిల్లా కలెక్టర్ నేతృత్వంలో అటవీ పునరుద్దరణ ప్రణాళికలు.
  • పటిష్ట చర్యలు, పర్యవేక్షణ ద్వారా అటవీ భూములు, సంపద రక్షణ.
  • ఇప్పటికే గ్రీన్ బడ్జెట్ నిధులను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం.
  • మొక్కలు నాటే మిగతా శాఖలకు సాంకేతిక సహకారం ఇవ్వనున్న అటవీ శాఖ.
  • ప్రతీ విద్యా సంస్థ, ప్రభుత్వం, ప్రైవేటు సంస్థల ఖాళీ స్థలాల్లో ఖచ్చితంగా పచ్చదనం పెంపుకు చర్యలు.
  • ప్రతీ మండల కేంద్రంతో పాటు, పట్టణ ప్రాంతాలకు సమీపంలో పెద్ద ప్రకృతి వనాల ఏర్పాటుకు ప్రాధాన్యత.
  • ఖచ్చితంగా 85 శాతం మొక్కలు బతికేలా పంచాయతీ రాజ్ చట్టం అమలుకు నిర్ణయం.
  • అన్ని స్థాయిల్లో ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు, ప్రజల భాగస్వామ్యం ఉండేలా చర్యలు.
  • గత ఆరు విడతల్లో నాటిన మొక్కలు మొత్తం 220.70 కోట్లు.
  • అడవుల బయట 159.88 కోట్ల మొక్కలు. అడవుల లోపల 60.81 కోట్ల మొక్కలు.
  • హరితహారం కోసం ఇప్పటిదాకా అయిన ఖర్చు (అన్ని శాఖలు కలిపి) 5,591 కోట్లు.
  • ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక (2019) ప్రకారం రాష్ట్రంలో 3.67 శాతం పచ్చదనం పెరుగుదల.
  • హరితహారంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 109 అర్బన్ ఫారెస్ట్ పార్కుల అభివృద్ది.
  • ఇప్పటికే పూర్తయిన పార్కులు – 53 ( 35 ప్రజలకు అందుబాటులోకి, 18 రెడీగా ఉన్నాయి.)
  • మిగతా 56 అర్బన్ ఫారెస్ట్ పార్కులను రానున్న ఏడాదిలో పూర్తి చేయాలనే లక్ష్యం.
  • ప్రభుత్వం గుర్తింపు పొందిన లే అవుట్లలోనూ పచ్చదనం పెంపుకు ప్రత్యేక కార్యాచరణ

Share This Post