The winner of the Rajanna cricket tournament is Cheguta

రన్నర్‌గా నిలిచిన బోనాల కొండాపూర్
మన తెలంగాణ/చేగుంట : గత 20 రోజులుగా నడుస్తున్న రాజన్న జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెం లో ఫైనల్ లో విజేతగా చేగుంట క్రికెట్ టీం, రన్నగా బోనాల కొండాపూర్ టీమ్లు గెలిచాయి. ఆదివారం చేగుంట మండలం బి కొండాపూర్‌లో జరిగిన రాజన్న క్రికెట్ ఫైనల్ టోర్నమెంట్ లో చేగుంట బోనాల కొండాపూర్ టీంలు హోరాహోరీగా పోరాడగా ఫైనల్ గా చేగుంట కప్పును గెలుచుకుంది. గెలి
చిన టీంకు టీఆర్ఎస్ జిల్లా సీనియర్ నాయకులు కొండాపూర్ మాజీ సర్పంచ్ రంగయ్యగారి రాజిరెడ్డి చేతుల మీదుగా బహుమతులు అందజేసారు. విజే
తకు కప్పుతో పాటు 35 వేల రూపాయలు బహుమతిగా అందజేసారు. విన్నర్‌గా నిలిచిన బోనాలకొండాపూర్ టీంకు రన్నర్ కప్పుతో పాటు 20 వేల రూపాయలు బహుమతి అందజేసారు. ఈ సందర్భంగా రంగయ్యగారి రాజిరెడ్డి మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడుతాయని తెలిపారు. నెల రోజుల నుండి ఎలాంటి గొడవలు లేకుండా రాజన్న టోర్నమెంట్ ను విజయవంత చేసి
న ఆర్గనైజర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఆటల్లో గెలుపు ఓటములు సహజమని తెలిపారు. కరోనావల్ల ఆర్భాటం చేయకుండా బహుమతులు సింపుగా అందజేసామని తెలిపారు. కరోనా సరిస్థితి కుదిటపడ్డాక త్వరలో పెద్ద ఎత్తున క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేస్తామని రాజిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో రంగయ్యగారి రాజిరెడ్డితో పాటు నాయకులు విట్టల్ రెడ్డి, సోసైటీ చైర్మన్ కొండల్ రెడ్డి,కొండాపూర్ సర్పంచ్ బాల్ నర్స్, ఎంపీటీసీ నవీన్,ఉప సర్పంచ్ రమేష్, బూర్గు శ్రీనివాస్, వెంకట్,గోపాల్, రాజు, ఆనంద్ తో పాటు పలు గ్రామాలకు
చెందిన క్రికెట్ క్రీడాకారులు పాల్గొన్నారు.

Share This Post