Tngo ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు శ్రీ అలుక కిషన్ గారి అధ్యక్షతన టీఎన్జీవో భవన్లో ఏర్పాటుచేసిన క్రిష్టమస్ సంబరాల

 

Tngo ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు శ్రీ అలుక కిషన్ గారి అధ్యక్షతన టీఎన్జీవో భవన్లో ఏర్పాటుచేసిన క్రిష్టమస్ సంబరాల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ సి నారాయణ రెడ్డి గారు విచ్చేసి క్రిస్మస్ కేక్ను కట్చేసి క్రైస్తవ సోదర సోదరిమణులకు ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపి మాట్లాడుతూ…. కుల మతాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఈ సంవత్సరం కూడా క్రిస్మస్ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం పక్షాన నిర్వహిస్తున్నామని దాంట్లో భాగంగా బోధన్, ఆర్మూర్, నిజామాబాద్ డివిజన్లలో జరుపుకున్నామని అదేవిధంగా ఈరోజు టీఎన్జీవో ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నందుకు జిల్లా టీఎన్జీవో అధ్యక్ష కార్యవర్గ బృందాన్ని జిల్లా యంత్రాంగం పక్షాన అభినందిస్తున్నానని తెలుపుతూ, జిల్లాలో గల ప్రజలందరూ ప్రతి పండుగను కులమతాలకు అతీతంగా జరుపుకొని ఐక్యతను చాటాలని కోరారు… మరియు జోనల్ విధానం అమలులో భాగంగా జిల్లా కలెక్టర్ ఉద్యోగుల పంపిణీ కార్యక్రమానికి సహకరించిన టీఎన్జీవో అధ్యక్ష కార్యదర్శులు మరియు జిల్లా యంత్రాంగం పక్షాన కృతజ్ఞతలు తెలిపారు అనంతరం జిల్లా టీఎన్జీవో అధ్యక్షులు కిషన్ గారు మాట్లాడుతూ టీఎన్జీవో సంఘం ఉద్యోగుల పక్షపాతి సంఘమని మరియు ఉద్యోగుల సంక్షేమంతో పాటు వివిధ సేవ కార్యక్రమాలను కులమతాలకు అతీతంగా నిర్వహించి ప్రజలందరి మధ్య ఐక్యతను చాటుటకు కృషి చేస్తున్నామని తెలిపారు దాంట్లో భాగంగానే ప్రతీ సంవత్సరం టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో టీఎన్జీవో అధ్యక్ష కార్యదర్శులు అలుక కిషన్ గారు,సంగం అమృత్ కుమార్ గారు, అన్ని యూనిట్ శాఖల టీఎన్జీవో అధ్యక్ష కార్యదర్శులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, క్రైస్తవ జిల్లా మతపెద్దలు జాన్సన్ గారు, జోసఫ్ గారు, ఏ ఐ సి సి జిల్లా అధ్యక్షులు వయ్యా డేవిడ్ గారు, జాన్ సామ్యుల్ గారు , జాన్సన్ గారు అబ్రహం గారు వివిధ శాఖల క్రైస్తవ సోదర సోదరీమణులు ఉద్యోగులు అధిక సంఖ్యలో హాజరయ్యారు

 

Share This Post