TS I పాస్ ద్వారా పరిశ్రమల స్థాపనకు వెంటనే అనుమతులు ఇవ్వాలి జిల్లా కలెక్టర్ డి హరిచందన.
జిల్లా లో కొత్త పరిశ్రమలు నెలకొల్పి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాల్సిన అవసరం చాలా ఉందని, పరిశ్రమల స్థాపనకు దరఖాస్తులు వస్తే వారికీ వెంటనే అనుమతులు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరం లో జిల్లా పరిశ్రమల ప్రమోషన్ కమీటి సమావేశం జిల్లా అధ్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా లో స్థాపించాబడుచున్న పరిశ్రమలకు టి.ఎస్. ఐపాస్ ద్వార అనుమత్లు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. టి –ప్రైడ్ స్కీం ద్వార ఎస్సి, ఎస్టీ మరియు PHC వారికి రాయితీ మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశం లో 39 మంది యస్సీ లకు, 37 మంది యస్ టి లకు, 3 వికలాంగులకు ప్రభుత్వ రాయితీలను మంజూరు చేయడం జరిగింది. పరిశ్రామల ఏర్పాటు వలన జిల్లా లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కాబట్టి పరిశ్రమల అనుమతులకు ఆలస్యం కాకుండా వెంటనే అనుమతులను ఇవ్వాలని సంబందిత అధికారులకు సూచించారు.
ఈ సమావేశం లో అదనపు కలెక్టర్ కె చంద్ర రెడ్డి, GM DIC రామ సుబ్బా రెడ్డి, జిల్లా అధికారులు మురళి, ప్రసన్న కుమార్, తదితరులు పాల్గొన్నారు.