TS TET-2022 పరీక్షల నిర్వహణపై అవగాహన కార్యక్రమం : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన     తేది:07.06.2022, వనపర్తి.

ఈ నెల 12వ తేదీన నిర్వహించనున్న తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TS TET-2022) పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అధికారులకు ఆదేశించారు.
మంగళవారం ఐ డి ఓ సి. సమావేశ మందిరంలో టెట్ పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈనెల 12వ తేదీన నిర్వహించనున్న టెట్ పరీక్షలు పేపర్ – I ఉదయం గం. 9.30 నిమిషాల నుండి మధ్యాహ్నం గం. 12.00 ల వరకు, పేపర్ – II మధ్యాహ్నం గం. 2.30 నిమిషాల నుండి గం. 5.00 ల వరకు నిర్వహించడం జరుగుతుందని ఆమె తెలిపారు. పేపర్ -I లో 9,026 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు, 38 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. పేపర్-II లో 6,634 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని, 29 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆమె వివరించారు.
పరీక్షా కేంద్రాలలో ఎలాంటి అవకతవకలు జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు ఆమె సూచించారు. పరీక్ష కేంద్రాలలో 144 సెక్షన్ అమలు చేయాలని, దగ్గరలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని, పరీక్షా కేంద్రాలలో సెల్ ఫోన్ లకు అనుమతి లేదని ఆమె తెలిపారు. ఎనిమిది మంది రూట్ అధికారులను, చీఫ్ సూపరింటెండెంట్లను, శాఖాధికారులను ఏర్పాటు చేసినట్లు ఆమె సూచించారు.  పరీక్షా కేంద్రాలలో త్రాగునీరు, పారిశుద్ధ్యం, షెల్టర్ లను, సీసీ కెమెరాలను  ఫ్యాన్ లు తదితర ఏర్పాటు చేయాలని అధికారులకు ఆమె సూచించారు. పరీక్షా కేంద్రాలకు వచ్చే విద్యార్థులకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని ఆమె సూచించారు. ఏ స్థాయి అధికారులకు సెల్ ఫోన్లను అనుమతించబోమని ఆమె సూచించారు. ఎలాంటి అవకతవకలు జరగకుండా పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలని ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమంలో డి ఈ ఓ రవీందర్, పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ మధుకర్, ఎం ఈ ఓ లు, రూట్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
…….
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post