vaccination special drive success story

విజయగాధ

ప్రపంచాన్ని గడ గడలాడిస్తున్న కంటికి కనబడని సూక్ష్మ క్రిమి కరోనా వైరస్ నుండి మానవాళిని రక్షించాలంటే ఏకైక సాధనం 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేయాలనే  ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్  కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తున్నది.. 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా వ్యాక్సిన్ వేస్తున్నారు. కోవిడ్ వ్యాధిని సమూలంగా నిర్మూలించి ప్రజల ప్రాణాలను కాపాడుటపై ప్రత్యేక దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 16వ తేదీ నుండి ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమాలను చేపట్టింది. ఇందులో భాగంగా మారుమూల గ్రామాలున్న భద్రాద్రి జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేసేందుకు జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆగస్టు 19వ తేదీన  వాక్సినేషన్ మొబైల్ వాహనాలను ఏర్పాటు చేశారు. మొబైల్ వాక్సినేషన్ వాహనాలు మారుమూల గ్రామాల్లో నివసిస్తున్న దాదాపు  50 వేల మందికి వాక్సిన్ వేశారు. వాక్సినేషన్ పై ఉన్న అనానాలను నివృత్తి చేసేందుకు .. అర్హులైన వారందరికీ వాక్సిన్ ఇవ్వాలనే లక్ష్యంతో చేపట్టిన మొబైల్  వ్యాక్సినేషన్ కార్యక్రమం దిగ్విజయంగా  జరుగుతున్నది. ఇంటంటి సర్వే చేపట్టి, వాక్సిన్ తీసుకోని వారి వివరాలు సేకరించి వాక్సిన్ ఇచ్చేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టి వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు. కూలి పనులు చేస్తున్న ప్రాంతాలకు వైద్య సిబ్బంది వెళ్లి అర్హులకు వ్యాక్సిన్ వేయు విధంగా కలెక్టర్ చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నది.  జిల్లాలో మొత్తం 7,67,978 మంది  అర్హులున్నట్లు గుర్తించి 38 ఆరోగ్య కేంద్రాలలో వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టారు. జిల్లాలో నూరు శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ జరగాలనలనే ప్రభుత్వ లక్షానికి అనుగుణంగా  గ్రామస్థాయి నుండి పట్టణస్థాయి వరకు ప్రజా ప్రతినిధులను భాగస్వామలును చేసుకుంటూ ముందుకు పోతున్నారు. వ్యాధి నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 16వ తేదీ నుండి ప్రారంభించిన ప్రత్యేక  వ్యాక్సినేషన్ ప్రక్రియలోఇప్పటి వరకు 2 లక్షల మందికి మొదటి డోస్  వ్యాక్సిన్ ఇచ్చారు. జిల్లాలోని దమ్మపేట మండలంలోని 3 గ్రామాల్లో 1271 మందికి, సుజాతనగర్ మండలంలోని 5 గ్రామాల్లో 2196 మందికి, జూలూరుపాడు మండలంలోని 12 గ్రామాలలోని 2421 మందికి మొత్తంగా ఈ 20 గ్రామాల్లోని 5888 మంది మొదటి డోస్ వాక్సిన్ తీసుకోగా ఈ

20 గ్రామాలను నూటికి నూరు శాతం వ్యాక్సిన్ జరిగిన గ్రామాలుగా అధికారులు ప్రకటించారు.  నూరు శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసిన  మొట్టమొదటి గ్రామం సుజాతనగర్  మండలంలోని చిమ్నాతండా కాగా ఆ గ్రామంలో జిల్లా కలెక్టర్  ప్రత్యేక అభినందన సభ నిర్వహించి వాక్సిన్ ప్రక్రియలో ముందు నిలిచిన గిరిజన గ్రామ ప్రజలను,  లక్ష్య సాధనలో కృషి చేసిన వైద్య, అంగన్వాడీ సిబ్బందిని,  ప్రజా ప్రతినిధులను, కార్యదర్శిని అభినందించి  శాలువాలు, పుష్ప గుచ్చాలతో సత్కరించారు.

మీ గ్రామం మన జిల్లాకు ఆదర్శంగా నిలిచిందని అభినందించారు. మీ స్పూర్తితో జిల్లాను నూరు శాతం వ్యాక్సిన్ పూర్తి చేసిన జిల్లాగా ప్రకటించుటకు వ్యాక్సిన్ కార్యక్రమం ముమ్మరంగా పూర్తి చేస్తామని చెప్పారు.

Share This Post