VKB-కాళోజి నారాయణ రావు జయంతి సందర్బంగా వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల ఘనంగా నివాళి

ప్రజా కవి, తెలంగాణ ఉద్యమ యోధుడు కాళోజి నారాయణ రావు జయంతి సందర్బంగా ఈరోజు కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరములో జిల్లా కలెక్టర్ నిఖిల వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ కాళోజి నారాయణ రావు స్వతంత్ర సమర యోధుడని, తెలంగాణ ఉద్యమకారుడని, అయన జన్మదినాన్ని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. తన కవిత్వాలు రచనల ద్వారా తెలంగాణ ప్రజలకు చైతన్యవంతులు చేసిన గొప్ప కవి అని కలెక్టర్ కొనియాడారు.

ఈ సందర్బంగా జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రంలో పుట్టి వరంగల్ జిల్లాలో స్థిరపడ్డారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాలలో ముఖ్య పాత్ర పోషించిన గొప్ప వ్యక్తి అని, వారి సేవలు మరువరానివని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, వికారాబాద్ RDO ఉపేందర్ రెడ్డి, వికారాబాద్ ఉద్యమ నేత, కవి సంగీతపు రాజలింగంతో పాటు జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post