VKB-కేంద్ర మంత్రి పర్యటన సందర్బంగా ఏర్పాట్లపై సమీక్ష.. వికారాబాద్ కలెక్టర్ నిఖిల

వికారాబాద్ జిల్లా :- దేశంలోనే మొదటి సరిగా వికారాబాద్ జిల్లాలో “మెడిసిన్ ఫ్రమ్ ది స్కై ” అను కార్యక్రమంలో భాగంగా కేంద్ర విమానయాన శాఖా మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి KTR, విద్యా శాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి గార్లు ఈ నెల 11న పట్టణానికి రానున్నందున సంబంధిత అధికారులతో విస్తృత ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ నిఖిల కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, కొత్త కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో హెలిప్యాడ్, పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో సభా స్థాలి ఏర్పాటు చేయాలని సూచించారు. సభా స్థాలి వద్ద, హెలిప్యాడ్ వద్ద ఇబ్బందులు ఏర్పడకుండా బారికేడ్లు ఏర్పాటు చేయాలని, ముఖ్య అతిదులు పర్యటించే దారులన్నీ బాగు చేయాలని R&B అధికారులను ఆదేశించారు. వైద్య శాఖ అధికారులు PHC ల వద్ద డాక్టర్ లను సిద్ధంగా ఉంచాలని, అలాగే సభాస్థాలి వద్ద అందరికి శానిటైజ్ చేయాలని, మాస్కులు లేని వారికి మాస్కులు అందించాలన్నారు. సభా ప్రాంగణంలో ఒక అంబులెన్సుతో పాటు ఒక ఫైర్ ఇంజన్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఏర్పాట్లు అన్ని పక్కడ్బందీగా జరగాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
సమావేశ అనంతరం అధికారులతో కలసి కొత్త కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ను పరిశీలించారు. హెలిప్యాడ్ వద్ద ప్రజలు రాకుండా బారికేడింగ్, పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేయూలని సూచించారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్న కార్యక్రమానికి సంబంధించిన డయాస్, ఇతర ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు తగు సూచనలు జారీ చేసారు. ఈ సందర్బంగా డ్రోన్ ట్రయల్ ను పరిశీలించినరు.

ఈ సందర్బంగా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా మొదటి సరిగా మన వికారాబాద్ జిల్లా నుండి మంత్రివర్యుల కృషితో మెడిసిన్ ఫ్రమ్ ది స్కై నిర్వహించడం జరిగితుందన్నారు. రోడ్డు సదుపాయాలు లేని, దూర ప్రాంతాలకు అత్యవసర సమయంలో రోగులకు అవసరమైన మందులు, వాక్సిన్ లు అందించెందుకు ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా SP నారాయణ, జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్, చంద్రయ్య, జిల్లా అదనపు SP రషీద్, జిల్లా వైద్య అధికారి తుకారామ్, R&B EE లాల్ సింగ్, RTO భద్రు నాయక్, వికారాబాద్, తాండూర్ RDO లు ఉపేందర్ రెడ్డి, అశోక్ కుమార్, వైద్య అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post