VKB-జిల్లా అధికారులతో శాఖల వారిగా సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్.. నిఖిల

పత్రిక ప్రకటన,
తేది : 02.09.2021
వికారాబాద్ జిల్లా :- జిల్లాలోని అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల వద్ద ANM, ఆశ వర్కర్లను ఏర్పాటు చేసి ప్రతి రోజు విద్యార్థులకు ఫీవర్ చెక్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నిఖిల జిల్లా వైద్య అధికారిని ఆదేశించారు.
ఈరోజు స్థానిక DPRC భావనములో జిల్లా అధికారులతో శాఖల వారిగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలలో థర్మల్ స్కానర్ ఉంచాలని, ప్రతి విద్యార్ధికి గేట్ వద్ద జ్వరం పరీక్ష నిర్వహిస్తే కోవిడ్ ను నియంత్రించవచ్చాన్నారు. జ్వరం ఉన్న విద్యార్థులకు RTPCR పరీక్షలు నిర్వహించి, కోవిడ్ లక్షణాలు ఉంటే ఆ విద్యార్థిని అతని ఇంటివద్ద ఐసొలేషన్ లో వైద్య సేవలు అందించినట్లయితే ఇతర విద్యార్థులు సురక్షితంగా ఉంటారని సూచించారు. జిల్లాకు మంజూరైన RTPCR సెంటర్ను రెండు రోజులలో ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రారంభోత్సవం కొరకు స్థానిక ప్రజా ప్రతినిధులకు ఇట్టి సమాచారం అందించాలన్నారు. అన్ని పాఠశాలలకు అంగన్వాడీ కేంద్రాలకు శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేయాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీ, NREGS నిధులతో వీటిని కొనుగోలు చేయాలని సూచించారు.
ఖరీఫ్ సీజన్ కు రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉంచాలన్నారు. రైతు బంధు పథకం ప్రతి రైతుకు అందేలా చూడాలన్నారు. జిల్లాలో గల 1196 చెరువులు, ప్రాజెక్టుల క్రింద ఆయకట్టు పూర్తి వివరాలు అందించాలని సూచించారు.
జిల్లాలో గొర్రెల పెంపకం కొరకు చర్యలు చేపట్టాలని సూచించారు. SC ST BC మైనారిటీ సంక్షేమ శాఖల ద్వారా విద్యార్థులకు సకాలంలో స్కాలర్ షిప్పులు అందేలా చూడాలన్నారు. జిల్లాలో సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కళాశాలలు, పాఠశాలల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికారులు అందరు రోజు వారిగా చేపట్టిన పనులను నిర్నిత ఫార్మాట్లో ప్రతిరోజు తన వాట్సాప్ కు పంపించాలని సూచించారు. ప్రతి పని పూర్తి నిబద్దతతో చేయాలని, ఇందులో ఏలాంటి సాకులు చెప్పకూడదని, అయితే అయినదని లేకుంటే కాలేదని, కాకపోవడానికి కారణాలు తెలిపి సలహాలు పొందాలని సూచంచారు. ఈ సందర్బంగా విద్యుత్, హార్టికల్చర్, మైన్స్ తదితర శాఖలపై సమీక్షించారు.
ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, జడ్పీ సీఈఓ జానకిరెడ్డి లతో పాటు అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
——————————————–DPRO / Vikarabad.

Share This Post