VKB – జిల్లా కలెక్టర్ పౌసుమి బసు దౌల్తాబాద్ మండలంలోని మాటూర్ గ్రామంలో విస్తృత పర్యటన

పత్రిక ప్రకటన, తేది: 11.08.2021
వికారాబాద్ జిల్లా :- దౌల్తాబాద్ మండలంలోని మాటూర్ గ్రామంలో ఈరోజు జిల్లా కలెక్టర్ పౌసుమి బసు విస్తృతంగా పర్యటించి వైకుంఠదామం, పల్లె ప్రకృతివనం, డంపింగ్ యార్డ్, నర్సరీ లను పరిశీలించారు. వైకుంఠదామంకు మిగిలివున్న కలరింగ్, బోర్డు ఏర్పాటు చేసి పూర్తి చేయాలన్నారు. పల్లె ప్రకృతివనం బాగుందని, ఇంకా ఖాళీగా ఉన్న స్థలంలో పెద్ద సైజు వేప, రావి, కానుగ మొక్కలు నాటాలని సూచించారు. నర్సరిలో మిగిలియున్న మొక్కలను గ్రామంలో ఐదు ఎకరాల నిరూపయోగ ప్రభుత్వ భూమిలో కూడా మొక్కలు నాటాలని అధికారులను సూచించారు. వైకుంఠదామం, డంపింగ్ యార్డ్ – పల్లె ప్రకృతి వనం మధ్య రెండు బోర్లు వేయాలని అధికారులను సూచించారు. నర్సరీని చూసి సంతృప్తి వ్యక్త పరిచారు. డంపింగ్ యార్డ్ వద్ద ముండ్ల చెట్లు నాటి ఫెన్సింగ్ చేయాలని సూచించారు.
అనంతరం గ్రామంలోని దళిత వాడలో విస్తృతంగా పర్యటించి అక్కడ ఉన్న సమస్యలను పరిశీలించి పరిష్కరించేందుకు అధికారులను ఆదేశించారు. మురికి కాలువల పరిశుభ్రత, ఇంటింటా చెత్త సేకరణ చేపట్టి గ్రామాన్ని దోమలు ప్రబలకుండా పరిశుభ్రంగా ఉంచాలన్నారు. అపరిశభ్రంగా ఉన్న ప్రదేశాలను అప్పటికప్పుడే పరిశుభ్రం గవించారు. రోడ్లపై మురుగు నీరు ప్రవహించకుండ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలన్నారు. గ్రామంలో స్వచ్ఛ భరత్ క్రింద నిర్మించిన మరుగుదొడ్లను ప్రజలు వినియోగించకపోవడం పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తపరిచారు. కొందరు మరుగుదొడ్లును స్టోర్ రూంలుగా మార్చుకోవాడం వల్ల తీవ్రంగా స్పందిస్తూ ప్రతి ఒక్కరు మరుగుదొడ్లను వినియోగించుకొనే విధంగా చర్యలు చేపట్టాలని గ్రామ సర్పంచ్, కార్యదర్శిని ఆదేశించారు. కిరాణా షాప్ వారు ప్లాస్టిక్ వ్యర్థాలను మురికి కాలువలో వేసినందున రూ. వెయ్యి చొప్పున ఇద్దరికీ పెనాల్టీ వేశారు. వాటర్ ట్యాంక్ వద్ద నీరు ఓవర్ ఫ్లో అయి రోడ్లపై నిలువకుండ చూడాలని సూచించారు. గ్రామంలో శితిలావస్థలో ఉన్న రెండు గృహలను కూల్చివేయాలని, అలాగే నిరూపయోగంగా ఉన్న పాత బావులను పూడ్చివేయాలని అధికారులకు ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ కలెక్టర్ చంద్రయ్య, DRDO కృష్ణన్, DPO రిజ్వానా, PR/DE లక్ష్మణ్ రావు, తహసీల్దార్ హారదీప్ సింగ్, గ్రామ సర్పంచ్ వెంకటమ్మ, కార్యదర్శి పరేష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
≠======================
DPRO/VKB.

Share This Post