VKB-డయాల్ ఇన్ గ్రీవెన్స్ కార్యక్రమంలో ప్రజా సమస్యల పరిష్కారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ పౌసుమి బసు

పత్రిక ప్రకటన, తేది: 23.08.2021

వికారాబాద్ జిల్లా :- ప్రతి సోమవారం ఉదయం 9:30 నుండి 10:30 గంటల వరకు నిర్వహించు “డయల్ ఇన్ గ్రీవెన్స్ ” కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రజల నుండి వివిధ సమస్యలపై (23) ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరించడమైనదని జిల్లా కలెక్టర్ పౌసుమి బసు తెలియజేసినారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ధరణి భూ సమస్యలతో పాటు ఇతర శాఖలకు సంబంధించిన సమస్యలకు కూడా పరిష్కరించుకొవాలని సూచించారు. పంచాయతీ రాజ్, ఉపాధి హామీ, పారిశుధ్యం, మున్సిపల్ సమస్యలు, మిషన్ భగీరథ త్రాగునీటి సమస్యలు, రైతు బంధు, రైతు భీమా, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్, ఎరువులు, నకిలీ విత్తనాలు, సంక్షేమ శాఖల సమస్యలు, పశు సంవర్ధక తదితర శాఖలకు సంబంధించిన అన్ని సమస్యలపైన కూడా ప్రజలు ఫిర్యాదులు చేసినట్లయితే పరిష్కరించడం జరుగుతుందన్నారు.
** ధరణి భూ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ప్రతి బుధవారం కూడా ఉ. 9:30 నుండి 10:30 వరకు “డయాల్ ఇన్ గ్రీవెన్స్” కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఈ సందర్బంగా తెలియజేసినారు. ప్రజలు ఇట్టి అవకాశాన్ని వినియోగించుకొని తమ భూ సమస్యలు పరిష్కరించుకొవాలని సూచించారు.
అనంతరం గత వారం నిర్వహించిన గ్రీవెన్స్ లో వచ్చిన ఫిర్యాదులపై శాఖల వారిగా తీసుకున్న పరిష్కార చర్యలపై సమీక్షించారు. అన్ని సమస్యలకు ఎప్పటికప్పుడు పరిష్కరించి గ్రీవెన్స్ పోర్టల్లో అప్లోడ్ చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు మోతిలాల్, చంద్రయ్య, డి ఆర్ డి ఓ కృష్ణన్, వికారాబాద్ ఆర్ డి ఓ ఉపేందర్ రెడ్డి, వివిధ శాఖల అందరు అధికారులు పాల్గొన్నారు.

—————–DPRO/VKB.

Share This Post