VKB-పల్లె ప్రగతిలో చేపట్టిన కార్యక్రమాలపై సమీక్షించిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల.

పత్రిక ప్రకటన, తేది: 02.09.2021

వికారాబాద్ జిల్లా :- జిల్లాలో అసంపూర్తిగా ఉన్న వైకుంఠదామాలు, పల్లె ప్రకృతి వానల పనులను వేగవంతం చేసి ఈ మసాంతం వరకు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నిఖిల అధికారులను ఆదేశించారు.
ఈరోజు స్థానిక DPRC భావనంలో పల్లె ప్రగతిలో చేపట్టాల్సిన పనుల పురోగతిపై స్పెషల్ ఆఫీసర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీవోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ వైకుంఠదామాలు, డంపింగ్ యార్డులు, రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాల వద్ద మొక్కలు నాటి గ్రీన్ ఫెన్సింగ్ చేసి అందంగా తీర్చి దిద్దాలన్నారు, అలాగే అన్నింటికీ నీటి సదుపాయాలు కల్పించాలని సూచించారు. పల్లె ప్రకృతి లేని గ్రామాలకు స్థల సేకరణ వారం రోజులలో పూర్తి చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. బృహత్ పల్లె ప్రకృతి వనాల కొసం కూడా పది ఎకరాలకు తగ్గకుండా స్థలం సేకరించాలన్నారు. గ్రామం ప్రధాన రహదారులకు ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ క్రింద మంచి మొక్కలు నాటి గ్రామాల రూపు రేఖలు మారిపోయేలా చేయాలన్నారు. రోడ్లకు ఇరువైపులా రెండు వరసలలో మొక్కలు నాటేందుకు గుంతలు తీయాలనీ సూచించారు. అవసరమైన నిధులు గ్రామ పంచాయతీ గ్రీన్ బడ్జెట్ ను వినియోగించుకోవాలని తెలిపారు. ఇప్పటికే పూర్తి కావలసిన పనులు పూర్తి కాకపోవాడంపై అసంతృప్తి వ్యక్తపరిచారు. చేపట్టిన పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తానని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు.
ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు మోతిలాల్, చంద్రయ్య, జడ్పీ సీఈఓ జానకి రెడ్డి, DRDO కృష్ణన్, డీపీవో రిజ్వానా, dfo వేణుమాధవ్ లతో పాటు స్పెషల్ ఆఫీసర్లు, rdo లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీవో లు తదితరులు పాల్గొన్నారు. DPRO / VKB.

Share This Post