VKB-పల్లె ప్రగతి పనులను ఆకస్మికంగా పరిశీలించిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ పౌసుమి బసు

పత్రిక ప్రకటన, తేది: 21.08.2021

వికారాబాద్ మండలంలోని పాతూర్ గ్రామాన్ని జిల్లా కలెక్టర్ పౌసుమి బసు ఈరోజు ఆకస్మికంగా సందర్శించి పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డ్, వైకుంఠదామం నిర్మాణపు పనులను, గ్రామంలో పారిశుధ్య పనులను
పరిశీలించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామంలో ప్రైవేటు స్థలంలో నిర్వహిస్తున్న హరితహారం నర్సరీని పల్లె ప్రకృతివనం లోకి మార్చాలని ఆదేశించారు. ఇందుకు అవసరమైన నీటి సదుపాయం కొరకు బోరు మంజూరు చేయడం జరుగుతుందని సూచించారు. ఒక ఎకరా స్థలంలో గల పల్లె ప్రకృతివనం లో నాటిన మొక్కలు బాగున్నాయని ప్రశంశించారు. ఇంకా ఖాళీగా ఉన్న స్థలంలో మొక్కలు నాటాలని ఆదేశించారు. గ్రామంలో నిర్మించిన డంపింగ్ యార్డ్ DRC సెంటర్ను పరిశీలించారు. ప్రతిరోజు గ్రామంలో తడి చెత్త పొడి చెత్త సేకరణ సక్రమంగా జరుగుతుందా లేదా అని సర్పంచ్, గ్రామ కార్యదర్శిని అడిగి తెలుసుకున్నారు. డంపింగ్ యార్డ్ కు ముండ్ల మొక్కలతో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామంలోని వీధులతో పాటు ఇంటింటా తిరిగి పరిశుభ్రత, నీరు నిలువకుండ తీసుకోవలసిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు. నిరూపయోగంగా ఉన్న వస్తువులలో వర్షపు నీరు నిలువకుండ చూడాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని మలేరియా, డెంగీ తదితర సీజనబుల్ వ్యాధులు సోకకుండా జాగ్రత్తలు వహించాలని ప్రజలకు సూచించారు. ప్రతి వారం డ్రైడే గా నిర్వహించాలన్నారు. గ్రామంలో 30 సంవత్సరాలు పైబడిన వారిని గుర్తించి మధుమేహం, హై టెన్షన్ వ్యాధులను గుర్తించి వారికి వైద్య సేవలు అందేటట్లు చూడాలని ఆశా వర్కర్లను ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న వైకుంఠదామం పనులను పరిశీలించి వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. దారిలో ప్రధాన రహదారికి ఇరువైపులా నాటిన అవెన్యూ ప్లాంటేషన్ ను పరిశీలించారు.అంతకు ముందు గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని పరోశీలించారి. ఉపాధి హామీ కూలీలు (జాబ్ కార్డు హోల్డర్స్ ) తెలియజేసే రిజిస్టర్ ను, గ్రామ సభలు నిర్వాహంచే రిజిస్టర్, ఇతర రిజిస్యేర్లను పరిశీలించారి.
దారిలో వెళుతుండగా హనుమంత్ రెడ్డి అనే యువ రైతును కలెక్టర్ పలకరించి ఈ సారి ఏ పంట వేస్తున్నావని అడుగగా, రైతు స్పందిస్తూ తన 5 ఎకరాల పొలంలో వాము పంట వేస్తున్నామని రైతు తెలియజేసినాడు. ఇంతకు క్రితము పత్తి పంట వేస్తుంటిని కలెక్టర్ కు తెలియజేసినారు.
పంట మార్పిడి వల్ల అధిక లాభాలా అంటున్నాయని కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో DRDO కృష్ణన్, ఎంపీడీఓ సుభాషిణి, సర్పంచ్ లలితమ్మ, వికారాబాద్ ఎంపీపీ చంద్రకళ, గ్రామ కార్యదర్శి సుహాసిని, apo సురేష్ తదితరులు పాల్గొన్నారు.
=============DPRO/VKB.

Share This Post