VKB-పాఠశాలల్లో చేపట్టిన పారిశుధ్య పనులను పరిశీలించిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ పౌసుమి బసు

పత్రిక ప్రకటన
తేది 28.08.2021

వికారాబాద్ జిల్లా :- సెప్టెంబర్ 1నుండి పాఠశాలలు పున: ప్రారంభం కానున్నందున ఈరోజు జిల్లా కలెక్టర్ పౌసుమి బసు పరిగి, పూడూర్, వికారాబాద్ లోని కొత్తగడి ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన పారిశుధ్య పనులను, తరగతి గదులు, మరుగుదొడ్లు, విద్యుత్, త్రాగునేటి సదుపాయాలను పరిశీలించారు.
పాఠశాలలు ప్రారంభనికి ఇంకా మూడు రోజులే ఉన్నందువల్ల వేగవంతంగా పనులు పూర్తి చేయాలని, అవరణలోని పిచ్చి మొక్కలు తొలగించి, ప్రతి తరగతి గదిలో గల బెంచీలు, అన్ని పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, విద్యార్థులకు అన్ని మౌళిక వసతులు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నీటి సదుపాయం లేని పరిగి అంగన్వాడీ కేంద్రంలో వెంటనే మిషన్ భగీరథ నీటి సదుపాయం కల్పించాలని ఆదేశించారు.
పూడూర్ మండలంలోని ఎంకెపల్లి ఇంగ్లీష్ మీడియం మోడల్ హైస్కూల్ ను పరిశీలించి ఖాళీ స్థలంలో మంచి మొక్కలు నాటాలని ఆదేశించారు.
వికారాబాద్ మండలంలోని కొత్తగడి ప్రభుత ఉన్నత పాఠశాలను పరిశీలించి విద్యార్థులకు ఏలాంటి ఇబ్బందులు ఏర్పడకుండ అన్ని ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ అధికారి రేణుకదేవి, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి సంధ్యారాణి, పరిగి మున్సిపల్ కమీషనర్ ప్రవీణ్ కుమార్, పూడూర్ ఎంపీడీఓ ఉషా, ఎంఇఓ హరికిషన్ తదితరులు పాల్గొన్నారు. DPRO/VKB.

Share This Post