VKB-పాఠశాలల్లో విద్యార్థులకు అసౌకర్యం కలుగకుండ పారిశుధ్య పనులను చేపట్టాలి.. వికారాబాద్ జిల్లా కలెక్టర్ పౌసుమి బసు

పత్రిక ప్రకటన
తేది 28.08.2021.

వికారాబాద్ జిల్లా :- వచ్ఛే నెల సెప్టెంబర్ 1నుండి పాఠశాలలు పున: ప్రారంభం కానున్నందున విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండ ఉండేందుకు గాను చేపడుతున్న పారిశుధ్య పనులను ఆదివారం రోజున జిల్లా కలెక్టర్ పౌసుమి బసు సంబంధిత అధికారులతో కలిసి వికారాబాద్ పట్టణములోని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్లు, అంగన్వాడీ సెంటర్ లను విస్తృతంగా పరిశీలించారు.

వికారాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, రాజీవ్ గృహ కల్ప, ఎన్నెపల్లి వద్ద గల అంగన్వాడీ కేంద్రాలను, అనంతగిపల్లి వద్ద గల సాంఘిక సంక్షేమ శాఖ స్కూల్, హాస్టల్ లలో చేపట్టిన తరగతి గదుల పరిశుభ్రతను, మరుగుదొడ్లు, వంట గదులు, విద్యుత్, నీటి సదుపాయాలు, పరిసరాల పరిశుభ్రతలను పరిశీలించారు.

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి తరగతి గదిని శానిటైజ్ చేయాలనీ, విద్యుత్, నీటి సదుపాయం ఉండేలా చూసుకోవాలని సూచించారు. నీటి సదుపాయం కొసం మిషన్ భగీరథ అధికారులను సంప్రదించాలని సూచించారు. ఏ ఒక్క విద్యార్ధికి కూడా ఇబ్బంది కలుగకుండ పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.

అంతకు ముందు పట్టణంలోని 31, 32 మున్సిపల్ వార్డులలో తిరుగుతూ డెంగీ, మలేరియా తదితర సీజనబుల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు అవగాహన కల్పించారు. ఇంటి పైకాప్పుపై నీరు నిలివకుండా చూసుకోవాలని విరిగిన ప్లాస్టిక్ డబ్బాలు, ట్యూబ్ లు నీటి తోట్టేలలో నీరు నిలువకుండ ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోని డెంగీ బారిన పడకుండా జాగ్రత్తలు వహించాలని ప్రజలకు కలెక్టర్ సూచించారు. పార్కుల వద్ద అపరిశుభ్రంగా ఉండడంతో మున్సిపల్ అధికారులను వెంటనే పారిశుధ్యం పనులను చేపట్టాలని ఆదేశించారు. 32వ వార్డులో గల విద్యుత్ ట్రాన్స్ఫర్మర్ వద్ద అపరిశుభ్రంగా ఉండడంతో వెంటనే శుభ్రం చేయించాలని విద్యుత్ అధికార్లను ఆదేశించారు. వ్యాధులు ప్రబలకుండా ప్రతిరోజు మున్సిపల్ పరిధిలో పారిశుధ్య పనులు చేపట్టి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని మున్సిపల్ కమీషనర్ ను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మంజుల రమేష్, మున్సిపల్ కమీషనర్ శరత్ చంద్ర, DEO రేణుకదేవి, DWO లలితకుమారి, విద్యుత్ శాఖ, ఇంజనీర్ మరియు మున్సిపల్ ,కౌన్సిలర్లు, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
——————————————-
DPRO / Vikarabad.

Share This Post