VKB-పోషక లోపం లేకుండా చర్యలు చేపట్టాలి. అదనపు కలెక్టర్ చంద్రయ్య.

వికారాబాద్ జిల్లా :- గర్భిణీలు, బాలింతలకు పోషకాహారంపై గ్రామ స్థాయిలో పోషణ్ అభియాన్ కార్యక్రమాల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, పిల్లల పెరుగుదలకు పోషక ఆహారాలను అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య సంబంధిత అధికారులకు సూచించారు.

బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లోని సమావేశ మందిరంలో పోషణ అభియాన్ జిల్లా స్థాయి కన్వెర్జెన్సీ సమావేశం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ చంద్రయ్య మాట్లాడుతూ సెప్టెంబర్ 1 నుండి 30 వరకు నిర్వహిస్తున్న పోషణ మాసంలో రక్తహీనత, పౌష్ఠిక ఆహారం లోపం , తల్లిపాల ప్రాముఖ్యత అనే అంశాలపై మహిళలో అవగాహన కల్పించాలని అన్నారు. ఈ పోషణ అభియాన్ యొక్క ముఖ్య ఉద్దేశం చిన్న పిల్లలు, మహిళల్లో పోషకాహార లోపాన్ని గుర్తించి పరిష్కరించడం అన్నారు. జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు, పసి పిల్లలకు పోషక విలువలతో కూడిన పౌష్ఠిక ఆహారం అందించాలని సూచించారు. అంగన్వాడీ సెంటర్లు పునః ప్రారంభం అయినందున పరిశుభ్రత, పారిశుధ్యం పై ప్రత్యేక చోరువ తీసుకోవాలని సూచించారు. పిల్లలకు స్వచ్ఛమైన భోజనాలు, తాగు నీరు అందించాలని సూచించారు. ప్రతి అంగన్వాడీ సెంటర్కు మిషన్ భగీరథ నీటి సదుపాయం కల్పించాలని సూచించారు.

ఏ సందర్బంగా DWO లలితా కుమారి మాట్లాడుతూ వికారాబాద్ జిల్లాలో మొత్తం 1106 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయని, అందులో 0-5 సంవత్సరాల 61574 మంది పిల్లలకు సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. పోషక లోపం లేకుండా ప్రతి ఒక్కరిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాడం జరుగుతుందని తెలిపారు.

ఏ సమావేశంలో RDO ఉపేందర్ రెడ్డి, DSCDO మల్లేశం, ప్రోగ్రాం ఆఫీసర్ Dr. లలిత, జిల్లా అధికారులు, సీడీపీఓ లు, జడ్పీటీసీ లు తదితరులు పాల్గొన్నారు

Share This Post