VKB-ప్రజా సమస్యల పరిష్కారం కొసం ప్రతి సోమవారం “డయల్ ఇన్ గ్రీవెన్స్ “.. జిల్లా కలెక్టర్ పౌసుమి బసు

పత్రిక ప్రకటన, తేది:16.08.2021

ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 9:30 నుండి 10:30 వరకు ” డయల్ ఇన్ గ్రీవెన్స్ ” అను కార్యక్రమం నిర్వహించి ప్రజలకు సంభంధంచిన సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పౌసుమి బసు తెలియజేసినారు. ఇందుకు గాను ఒక ప్రత్యేక ల్యాండ్ లైన్ నెంబర్ ను కేటాయించారు. 08416256989 అను నెంబర్ కు ప్రజలు కాల్ చేసి తమ సమస్యలు తెలిపి పరిష్కరించుకొవాలని జిల్లా కలెక్టర్ ప్రజలను కోరారు.
ఈరోజు కలెక్టర్ కార్యాలయం లోని కాన్ఫరెన్స్ హాలులో జిల్లా అధికారులతో డయల్ ఇన్ గ్రీవెన్స్ ట్రాయల్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఈరోజు వివిధ సమస్యలపై ప్రజల నుండి (13) ఫోన్ కాల్స్ ను కలెక్టర్ స్వీకరించి వారికి సంభందించిన పెండింగ్ మ్యుటేషన్స్, DS పెండింగ్ తదితర భూ సమస్యలు, రైతు బంధు సమస్యలను ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పరిష్కరిస్తామని సూచించారు.
అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ, ప్రతి సోమవారం అధికారులందరు ఉదయం 9:30 గంటలకు డయాల్ ఇన్ గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొని శాఖల వారిగా వచ్చే సమస్యలను పరిష్కరించాలన్నారు. మండల స్థాయిలో అధికారులు బాగా పని చేసి అక్కడి కాక్కడే సమస్యలు పరిష్కరిస్తే, ప్రజలు ఇక్కడి వరకు రారని సూచించారు.
జిల్లాలో డెంగీ, మలేరియా తదితర సీజనబుల్ వ్యాధులు పెరుగకుండ అన్ని గ్రామాలలో ప్రతి రోజు పారిశుధ్య పనులు చేపట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు మోతిలాల్, చంద్రయ్య లతో పాటు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
==========
DPRO/VKB

Share This Post