VKB-బ్యాంకర్లతో డిసిసి/డిఎల్ఆర్ సి సమీక్ష సమావేశం.. వికారాబాద్ జిల్లా.

పత్రిక ప్రకటన, తేది: 26.08.2021.

వికారాబాద్ జిల్లా :- జిల్లాకు కేటాయించిన లక్ష్యాలకు అనుగుణంగా బ్యాంకర్లు అందరు లబ్ధిదారులకు అక్టోబర్ మసాంతం వరకు రుణాలు అందించాలని జిల్లా కలెక్టర్ పౌసుమి బసు ఆదేశించారు.
ఈరోజు స్థానిక DPRC భావనంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన DCC/DLRC సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని రైతులందరికి కేటాయించిన లక్ష్యాలకు అనుగుణంగా రుణాలు అందించాలని బ్యాంకర్లను సూచించారు. ఈ ఆర్థిక సంవత్సరములో 97,500 మంది రైతులకు రూ.1,028 కోట్ల రుణాలను రైతులకు సెప్టెంబర్ మసాంతం వరకు ఇవ్వవలసి ఉండగా, ఇప్పటి వరకు 61,050 మంది రైతులకు రూ.493 కోట్లు రుణాలు మంజూరు చేసి 48 శాంతం లక్ష్యం సాధించడం జరిగిందన్నారు. రైతులకు దీర్ఘకాళిక రుణాల క్రింద ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ యంత్ర పరికరాలు కొనుగోలు చేయుటకు గాను 969 కోట్ల లక్ష్యం కాగా, 243 కోట్ల రుణాలను అందించి 25 శాంతం లక్ష్యం సాధించడం జరిగిందన్నారు.
జిల్లాలో పరిశ్రమిక అభివృద్ధి కొసం 836 కోట్ల రూపాయల లక్ష్యం కాగా, 326 కోట్ల రుణాలు అందించి 39 శాంతం లక్ష్యం సాధించడమైనదాని, వచ్చే మార్చి, 2022 నాటికి 100 శాంతం లక్ష్యం సాధించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో 14,229 SHG గ్రూపులు ఉండగా, అందులో 809 గ్రూపులకు 28 కోట్ల రుణాలు మంజూరు చేయడమైనదని తెలిపారు. వీధి వ్యాపారులకు 6,634 మందికి రూ.10 వేల చొప్పున 6.63 కోట్ల రూపాయల రుణాలు అందించి 91 శాంతం లక్ష్యం సాధించామన్నారు. ప్రాధాన్యత రంగాలకు 30 జూన్ వరకు 1,211 కోట్ల రుణాలు ఇవ్వడం జరిగిందని కలెక్టర్ సమీక్షలో తెలియజేసినారు. SHG గ్రూపులకు అందజేసిన రుణాల రికవరీని జనవరి మాసం నుండి ప్రారంభించాలని కలెక్టర్ బ్యాంకర్లను ఆదేశించారు.
ఈ సమావేశంలో పాల్గొన్న వికారాబాద్ శాసన సభ్యులు మెతుకు ఆనంద్ ఋణ మాఫీ పై అడిగిన ప్రశ్నలకు జిల్లా వ్యవసాయ అధికారి సమాధానంగా మాట్లాడుతూ జిల్లాలో 29 వేల మంది రైతులకు ఋణ మాఫీ కాగా, ఇప్పటి వరకు 19,529 మంది రైతు ఖాతాలకు ఋణ మాఫీ డబ్బులు నేరుగా వారి ఖాతాలకు జమ చేయడం జరిగిందన్నారు. మిగితా వారి డబ్బులు త్వరలో జమ కానున్నాయని తెలియజేసినారు. శాసనసభ్యులు మాట్లాడుతూ రైతు ఋణ మాఫీ క్రింద రైతు ఖాతాలో జమ అయిన డబ్బులను కొన్ని బ్యాంకులు ఇతర అప్పుల క్రింద జమ చేసుకోవాడం జరుగుతుందని తన దృష్టికి వచ్చిందని, ఇకముందు ఇలా జరగకుండా చూడాలని బ్యాంకర్లను ఆదేశించారు. బ్యాంకుల వద్ద గంటల తరబడి నిలబడే కాస్టమర్ లకు కనీసం త్రాగు నీటి సదుపాయం కల్పించాలన్నారు. జిల్లాలో SBI తప్ప ఇతర బ్యాంకులలో లక్ష్యాలకు అనుగుణంగా రుణాలు మంజూరు అవ్వడం లేదన్నారు. అన్ని బ్యాంకులు లక్ష్యం మేరకు విరివిగా రుణాలు మంజూరు చేయాలని సూచించారు. సంక్షేమ శాఖల లబ్దిదారులకు ప్రభుత్వం నుండి సబ్సిడీ మంజూరు అయినప్పటికి బ్యాంకర్లు గ్రౌండింగ్ చేయనాందువల్ల వారు రుణాలు పొందలేక పోతున్నారని అందరికి రుణాలు మంజూరు అయ్యేలా చూడాలని కోరారు.
ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, DRDO కృష్ణన్, LDM రాంబాబు,నాబార్డ్ DDM తేజ్ స్వరూప్ రెడ్డి, వికారాబాద్ SBI RM శ్రీధర్ బాబూజీ, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ RM సయ్యద్ యూసఫ్, RS BTI శ్రీధర్ రెడ్డి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
——————–=———————-
DPRO /Vikarabad.

Share This Post